రేపు కీల‌క స‌మావేశం.. బస్సులు రోడ్డెక్కుతాయా?

ఏపీ-తెలంగాణ మధ్య ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు తిరగడం లేదు.దీంతో ప్రయాణికులు ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తుున్నారు.

 Ap-telangana-rtc-officers-meeting-tomorrow-TeluguStop.com

దీనిని ఉపయోగించుకుని ప్రైవేట్ బస్సు యాజమాన్యాలు భారీగా ఛార్జీలను వసూలు చేస్తున్నాయి.పండుగ సందర్భంగా చాలామంది ఎక్కువ ఛార్జీలు కట్టి హైదరాబాద్‌ నుంచి ఏపీలోని తమ సొంతూళ్లకు వెళ్లారు.

ఏపీ-తెలంగాణ మధ్య అంతరాష్ట్ర ఒప్పందం ఇంకా కుదరకపోవడంతో రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు తిరగడం లేదు.అయితే అంతరాష్ట్ర సర్వీసులపై మంగళవారం తెలంగాణ అధికారులతో మాట్లాడి తుది నిర్ణయం తీసుకుంటామని రవాణశాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు.

మంగళవారం ఇరు రాష్ట్రాల మధ్య అంతరాష్ట్ర ఒప్పందం కుదిరే అవకాశముందన్నారు.రెండు రాష్ట్రాల మధ్య బస్సులు తిప్పేందుకు ఇప్పటివరకు చాలా ప్రయత్నాలు చేశామన్నారు.

పేర్ని నాని మాటలను బట్టి చూస్తే ఈ వారంలో ఏపీ-తెలంగాణ‌ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు తిరగనున్నాయి.27వ తేదీన అంతరాష్ట్ర ఒప్పందం కుదిరితే.వెంటనే రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సలు రోడ్డెక్కే అవకాశముంది.లాక్‌డౌన్ కారణంగా మార్చి చివరివారం నుంచి తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు ఆగిపోయాయి.ఆ తర్వాత ఇప్పటివరకు బస్సులు రోడ్డెక్క లేదు.రెండు రాష్ట్రాల మధ్య అంతరాష్ట్ర ఒప్పందం కుదరకపోవడమే దీనికి కారణం.

అంతరాష్ట్ర ఒప్పందంపై చర్చించేందుకు ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు పలుమార్లు భేటీ అయినా.ఏకాభిప్రాయం కుదరలేదు.

దీని వల్ల ఆలస్యం అయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube