రాజీనామాకు సిద్దమైన రాహుల్‌ గాంధీ.. సీన్‌ చేస్తున్నారా?

కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ బాధ్యతలు తీసుకున్న తర్వాత జరిగిన ఈ సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ దారుణ పరాజయం పాలయ్యింది.అధికారంలోకి వస్తుందనే నమ్మకంతో పార్టీ నాయకులు చాలా ఆసక్తిగా ఫలితాల కోసం ఎదురు చూశారు.

 Congress President Rahul Gandhi Want To Doresign-TeluguStop.com

ఒక వేళ కాంగ్రెస్‌ వ్యక్తి పీఎం అవ్వకున్నా కాంగ్రెస్‌ సూచించిన వ్యక్తి పీఎం అవుతాడని గట్టి నమ్మకం పెట్టుకుంది.కాని అనూహ్యంగా మోడీ సొంత మెజార్టీతో అద్బుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

ఈ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ రాజీనామాకు సిద్ద పడ్డట్లుగా సమాచారం అందుతోంది.పార్టీ ఓటమి కారణంగా తాను రాజీనామా చేస్తానంటూ ప్రస్థావన తీసుకు వచ్చాడట.

అయితే రాహుల్‌ రాజీనామా విషయమై సోనియా గాంధీ వారించి, వర్కింగ్‌ కమిటీలో చర్చించి ఆ తర్వాత నిర్ణయం తీసుకుందామని చెప్పిందట.

ఓటమిపై విశ్లేషించేందుకు రాహుల్‌ గాంధీ ఆధ్వర్యంలో పార్టీ నాయకుల సమావేశం జరుగబోతుంది.

అందులో తన రాజీనామా విషయాన్ని రాహుల్‌ పార్టీ నాయకుల ముందు ఉంచే అవకాశం ఉంది.అయితే పార్టీ నాయకులు మామూలుగానే రాహుల్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారు.

ఓడిపోయినా పర్వాలేదు మీరే అధ్యక్షుడిగా కొనసాగాలంటూ కోరతారు.దాంతో రాహుల్‌ అధ్యక్షుడిగా కొనసాగుతాడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube