రాజ‌స్థాన్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో బీజేపీకి షాకే...

ఈ ఏడాది చివ‌ర‌లో రాజస్థాన్‌లో, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ బీజేపీకి క‌ష్టాలు త‌ప్పేలా లేవు.ఈరెండు రాష్ట్రాల్లోనూ బీజీపీ త‌న అధికారాన్ని కోల్పోయే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి.

ఏబీపీ-సీఎస్‌డీఎస్ మూడ్ ఆఫ్ ది నేష‌న్ స‌ర్వేలో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి.మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఇప్పటికప్పుడు జరిగితే కాంగ్రెస్‌కు 49%, భాజపాకు 34%, ఇతరులకు 17% ఓట్లు లభించే అవకాశముంద‌ని స‌ర్వేలో తేలింది.

రాజ‌స్థాన్‌లో ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌కు 44%, బీజేపీకి 39%, ఇతరులకు 17% ఓట్లు లభించే అవకాశముందని స‌ర్వేలే తేలింది.

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత వేగంగా జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో బీజేపీయేత‌ర పార్టీల‌న్నీ ఏక‌మ‌వుతున్నాయి.బీజేపీని ఓడించ‌డ‌మే ధ్యేయంగా పావులు క‌దుపుతున్నాయి.రాజస్థాన్‌లో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.2013లో బీజేపీ 45.50% ఓట్లతో 163 స్థానాలు గెలుచుకుంది.2014 లోక్‌సభ ఎన్నికల్లోనూ 55.1% ఓట్లతో మొత్తం 25 లోక్‌సభ స్థానాల్లోనూ విజ‌యం సాధించింది.అయితే ఇటీవల అజ్మీర్‌, అల్వార్‌ లోక్‌సభ ఉపఎన్నికల్లో బీజేపీ సిట్టింగ్‌ స్థానాలను కోల్పోయింది.ఇక్క‌డ కాంగ్రెస్ గెలిచింది.1998 నుంచి రాజస్థాన్‌లో ప్రతి అయిదేళ్లకోసారి పార్టీలు మారుతున్నాయి.

కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇప్పటివరకు ఉన్న సచిన్‌పైలట్‌ స్థానంలో మాజీ ముఖ్యమంత్రి అశోక్‌గెహ్లాట్‌ను రంగంలో దించితే మాత్రం బీజేపీకి క‌ష్టాలు త‌ప్పేవ‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు.మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో 2013లో బీజేపీ 45.19శాతం ఓట్లు సాధించి అంత‌కుముందు ఎన్నికలకంటే 22 సీట్లు అధికంగా గెలుచుకుంది.2014 లోక్‌సభ ఎన్నికల్లో 29 స్థానాలకుగాను 27 స్థానాల్లో గెలిచింది.15 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది.ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌చౌహాన్‌ను ఎదుర్కొని కాంగ్రెస్ నిల‌బ‌డ‌డం క‌ష్ట‌మేన‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు.

బీజేపీ యేత‌ర పార్టీల‌న్నీ ఏక‌మ‌వుతున్న ప్ర‌స్తుత త‌రుణంలో ఇప్ప‌టిక‌ప్పుడు పార్ల‌మెంటుకు ఎన్నికలు జ‌రిగినా ఎన్డీయే కూట‌మి బోటాబోటీ మెజారిటీ సాధిస్తుంద‌ని ఈ స‌ర్వే చెబుతోంది.

అయితే అదంత సుల‌భం కాద‌న్న విష‌యం మాత్రం స్ప‌ష్ట‌మ‌వుతోంది.ఎన్డీయే కూటమికి 274 సీట్లు, యూపీయే కూట‌మిని 164 సీట్లు, ఇతరులకు 105 సీట్లు వస్తాయని ఈ సర్వే వెల్లడించింది.

ఎన్డీఏకి 37%, యూపీఏకు 31%, ఇతరులకు 32% ఓట్లు లభిస్తాయని స‌ర్వేలో పేర్కొంది.

ఇక‌ ప్రజాకర్షక నేతల్లో అందరికంటే మోడీ ముందున్నారు.కానీ ఆ శాతం నానాటికీ తగ్గుతుండ‌డం గ‌మ‌నార్హం.2017 మేలో ఆయన ప్రజాకర్షణశక్తి 44% ఉండగా, ఈ ఏడాది జనవరిలో అది 37%కి తగ్గింది.తాజాగా అది 34%కి పడిపోవ‌డం గ‌మ‌నార్హం.ఇదే సమయంలో రాహుల్‌గాంధీ ప్రజాకర్షణశక్తి 16% నుంచి 24%కి పెరిగినట్లు సర్వే వెల్లడించింది.ఈ నేప‌థ్యంలోనే రాజ‌స్థాన్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్‌కు విజ‌యావ‌కాశాలు మెరుగ‌వుతున్నాయ‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube