రమణదీక్షితులు తప్పు చేస్తున్నాడా..? వెంకన్న పరువు తీస్తున్నాడా ..?

పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను తమ స్వార్ధం కోసం, రాజకీయం కోసం దిగజార్చేస్తున్నారు.ఇక్కడ తప్పు ఎవరిది అనే ప్రశ్న కొంచెంసేపు పక్కన పెడితే.

 Ramana Dekshutlu Poltics In Ttd-TeluguStop.com

ప్రతిష్టాత్మాకమైన ఆలయ పవిత్రత ఈ గొడవల వలన మసకబారుతోంది అనేది వాస్తవం.ఆలయ మాజీ ప్రధానార్చకులు రమణదీక్షితులు చేస్తున్నది ఎంతవరకు కరెక్ట్ .? ఆయన వెళ్తున్న మార్గం సరైనదేనా .? అసలు ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఎందుకు తత్తరపాటు పడుతోంది అనే ప్రశ్నలు అనేకం ఇప్పుడు జనాల్లో మెదులుతున్నాయి.ఏది ఏమైతేనేమి వెంకన్న పరువును మాత్రం బజారుకి లాగేశారు.

శ్రీవారి ఆభరణాలు చోరీ అయ్యాయని, పింక్ డైమాండ్ మాయం చేశారనని రమణ దీక్షితులు చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి.అదంతా ఉత్తిదే అని టీటీడీ ఈవో.వివరణ ఇచ్చారు.రమణ దీక్షితులు టీడీపీ పై ఆరోపణలు చేస్తుంటే, టీడీపీ అందుకు ప్రత్యారోపణలు చేస్తోంది.ఇంతలోనే ఆయన ప్రతిపక్ష నేత జగన్ ను కలవడం రాజకీయంగా సంచలనం రేపింది.

ఆయనపై టీడీపీ నాయకులు విమర్శల బాణాలు గట్టిగానే వదిలారు.రమణ దీక్షితులు చంద్రబాబును అపాయింట్ మెంట్ అడిగారన్నది అవాస్తవమని, తిరుమల వెళ్లిన సమయంలో సీఎం చాలా సార్లు కలిసినా, అప్పుడెందుకు తన ఇబ్బందుల్ని, సమస్యల్ని రమణ దీక్షితులు చెప్పుకోలేదు అంటూ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ విమర్శించారు.

రమణ దీక్షితుల వెనుక రాజకీయశక్తులున్నాయని, ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలవడం, వైసీపీ అధినేత జగన్ ను కలవడం చూస్తేనే ఇందులో రాజకీయం అర్ధం అవుతుందని టీడీపీ విమర్శిస్తోంది.

టీటీడీలో ఏదో అపచారం జరిగిపోతోందని.

దాన్ని కాపాడేందుకే తాను ఇదంతా చేస్తున్నాను అని రమణదీక్షితులు చెప్తున్నా .అదెక్కడా కనిపించడంలేడు.పదవికి సంబంధించి సమస్యలుంటే, అందుకోసం దేశంలో న్యాయస్థానాలు, ట్రైబ్యునళ్లున్నాయి.ఆయన తిరిగి ప్రధాన అర్చకుడిగా చేరాలనుకుంటే, ఆ భాగ్యం సుప్రీంకోర్టు మాత్రమే కల్పించగలదు.అంతేకానీ, అమిత్ షాను, జగన్ ను కలవడం వల్ల ఆయన అనుకునే ప్రయోజనాలేవీ నెరవేరే అవకాశాల్లేవు.నిరంతరం స్వామి వారి సేవ, భక్తుల విశ్వాసాల గురించి మాట్లాడే ఆయన, ఒక రాజకీయ నాయకుడిగా, పార్టీల అధినేతలతో చర్చించడం వలన కలిసొచ్చే ప్రయోజనం ఏమిటో ఆయనకే తెలియాలి.

తను పనిచేస్తున్న చోట తప్పు జరుగుతున్నప్పుడు వాటిని అప్పుడు యాజమాన్యం దృష్టికి వాటిని తీసుకురావాల్సిన ఆయన, పదవిపోతే తప్ప ఎందుకు స్పందించలేదు.? రమణ దీక్షితులు తన పదవికి సంబంధించి పోరాటం చేస్తున్నారా.లేక రాజకీయంగా టీడీపీని ఢీకొంటున్నారా అనే సందేహాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి.సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం, తనను పదవి నుంచి తొలగించే హక్కు ఎవరికీ లేదని, మిరాశీలకు శ్రీవారి సేవా భాగ్యం ఆజన్మాంతం ఉంటుందని ఆయన వాదిస్తున్నారు.

మరి అలాంటి పరిస్థితి ఉంటే, ఆయన రాజకీయ నాయకుల చుట్టూ తిరిగేకన్నా కోర్టులోనే పోరాడవచ్చు కదా ! అలా కాకుండా అనవసర రాజకీయాలు చేస్తూ.ఆలయ పవిత్రత దెబ్బతీయడం మాత్రం ముమ్మాటికీ తప్పే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube