‘రంగస్థలం’ ఇలా ముగిసింది

రామ్‌ చరణ్‌, సమంత జంటగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కి మార్చి చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘రంగస్థలం’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.రంగస్థలం చిత్రంతో ఈ సంవత్సరం వేసవి ప్రారంభం అయ్యింది.

 Rangasthalam Collections-TeluguStop.com

వేసవి ముగిసే వరకు కూడా రంగస్థలం జోరు కొనసాగుతూనే ఉంది.ఇప్పటికి కూడా సినిమా అక్కడక్కడ ఆడుతూనే ఉంది.

ఈమద్య కాలంలో సినిమాలు వారం రెండు వారాలు ఆడటమే గగనం అయ్యాయి.అలాంటిది ఈ చిత్రం ఇంకా కూడా ప్రదర్శింపబడుతుంది అంటే సినిమా ఏరేంజ్‌లో విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

చెవిటి వాడు చిట్టిబాబు పాత్రలో రామ్‌ చరణ్‌ నటించిన విషయం తెల్సిందే.

ఈ చిత్రం మొదటి వారంలోపే వంద కోట్లను సునాయాసంగా రాబట్టింది.ఇక ఈ చిత్రంతో రామ్‌ చరణ్‌ మొదటి సారి ఓవర్సీస్‌లో టాప్‌ పొజీషన్‌ను దక్కించుకున్నాడు.సుకుమార్‌ బ్రాండ్‌ వ్యాల్యూ మరియు సినిమాకు ఉన్న భారీ క్రేజ్‌ నేపథ్యంలో ఓవర్సీస్‌లో రికార్డు స్థాయి వసూళ్లు నమోదు అయ్యాయి.

ఇప్పటి వరకు రామ్‌ చరణ్‌ నటించిన ఏ సినిమా కూడా 100 కోట్ల షేర్‌ను దక్కించుకోలేదు.కాని ఈ సినిమా మాత్రం ఏకంగా 125 కోట్ల షేర్‌ను దక్కించుకుని టాప్‌ చిత్రాల జాబితాలో చేరిపోయింది.

కేవలం షేర్‌ మాత్రమే కాకుండా గ్రాస్‌ కలెక్షన్స్‌ విషయంలో కూడా రామ్‌ చరణ్‌ సినిమా రికార్డును దక్కించుకుంది

తెలుగులో 200 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను సాధించిన మూడవ చిత్రంగా రంగస్థలం నిలిచింది.లాంగ్‌ రన్‌లో ఈ చిత్రం దాదాపుగా 230 కోట్లను వసూళ్లు చేసినట్లుగా ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు.

భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం అంతే స్థాయిలో వసూళ్లను సాధించి దుమ్మ దుమ్ముగా రికార్డులను బ్రేక్‌ చేసింది.కేవలం నైజాం ఏరియాలోనే ఈ చిత్రం ఏకంగా 28.75 కోట్లను రాబట్టి టాప్‌ 5 చిత్రాల జాబితాలో చేరింది.భరత్‌ అనే నేను చిత్రం వచ్చి భారీ వసూళ్లను నమోదు చేసినా కూడా ఈ చిత్రం ఏమాత్రం తగ్గకుండా అదే జోరును కొనసాగించింది.

సీడెడ్‌లో 19 కోట్లు, ఓవర్సీస్‌లో 18 కోట్లు వసూళ్లు చేసింది

రామ్‌ చరణ్‌ కెరీర్‌ బెస్ట్‌ చిత్రంగా ‘రంగస్థలం’ నిలిచింది.సుకుమార్‌ దర్శకత్వంలో పూర్తి పల్లెటూరు బ్యాక్‌ డ్రాప్‌ మూవీ అనగానే కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు.

కాని అందరి అనుమానాలు పటాపంచలు చేస్తూ ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.విడుదలైన అన్ని ఏరియాల్లో కూడా మొదటి రెండు వారాల పాటు భారీ వసూళ్లు సాధించింది.

ఆ తర్వాత కూడా మంచి వసూళ్లు సాధించి చివరకు 127 కోట్లు సాధించింది.ఇక ఇతర రైట్స్‌ ద్వారా మరో 60 కోట్ల మేరకు ఈ చిత్రం దక్కించుకుంది.

అంటే నిర్మాతలకు ఈ చిత్రం కాసుల వర్షం కురిపించినట్లే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube