యువ‌త ఓట్ల‌కు గాలం.. ఏకంగా రూ. 20 ల‌క్ష‌ల రుణం.. గ్యారెంటర్‌గా ప్ర‌భుత్వం

గోవాలో మమతా బెనర్జీ పార‌ధ్యంలో తృణమూల్ కాంగ్రెస్-ఎంజిపి కూటమి ఎన్నికల ప్ర‌లోభాల‌కు తెర‌లేపింది.వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే యువతకు ఎలాంటి గ్యారంటీ లేకుండా రూ.20 లక్షల వరకు రుణ సౌకర్యం కల్పిస్తామని టీఎంసీ-ఎంజీపీ కూటమి తెలిపింది.తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) నేత‌ యతీష్ నాయక్ మాట్లాడుతూ యువశక్తి ర్డ్‌ ప‌థకం కింద యువతకు నాలుగు శాతం వార్షిక వడ్డీతో రూ.20 లక్షల వరకు రుణ సదుపాయాన్ని క‌ల్పిస్తామ‌ని, బ్యాంకుకు ఎటువంటి హ‌మీ ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు.ప్రభుత్వం ల‌బ్ధిదారుల‌కు గ్యారెంటర్‌గా నిలుస్తుంద‌న్నారు.

 Goa Elections Tmc Mgp Alliance Promises-TeluguStop.com

ఈ కార్యక్రమంలో టిఎంసి నేత‌లు చర్చిల్ అలెమావో, అలెక్సో రెజినాల్డో లౌరెంకో, కిరణ్ కండోల్కర్, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజిపి) నాయకుడు సుదిన్ ధవలికర్ పాల్గొన్నారు.టిఎంసి, ఎంజిపి కూటమి అధికారంలోకి వస్తే, ఈ పథకం అమలు చేస్తామన్నారు.

ఈ పథకం యువతకు లాభదాయకమైన ఉపాధిని అందించడానికి లేదా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి సహాయపడుతుంద‌ని నాయక్ తెలిపారు.కొత్త ప్రభుత్వం ఏర్ప‌డిన‌పుడు ప‌లు ఆర్థిక సంస్థలతో టై అప్ చేసుకుంటుంద‌ని, వాస్తవ వడ్డీ రేటుకు నాలుగు శాతానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు.యువతకు నైపుణ్యం ఆధారిత విద్యను అందించడంలో స్టార్టప్‌ను ప్రారంభించ‌డానికి లేదా వ్యాపారాన్ని ప్రోత్సహించడంలో ఈ క్రెడిట్ సౌకర్యం సహాయపడుతుంద‌న్నారు.18-45 ఏళ్ల మధ్య వయస్సు గల యువ‌తీయువ‌కులు తమ వార్షిక ఆదాయంతో సంబంధం లేకుండా యువ శక్తి కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.ఈ పథకానికి రాష్ట్ర ఖజానా నుంచి ఏటా రూ.350 కోట్ల నుంచి రూ.1,100 కోట్లు ఖర్చవుతుందని నాయక్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube