యంగ్ క్రికెట‌ర్లను క‌పిల్‌దేవ్‌తో పోలుస్తున్న నెటిజ‌న్లు.. సీరియ‌స్ అవుతున్న గ‌వాస్క‌ర్‌,

మ‌న దేశంలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.క్రికెటర్ల‌కు ఉన్నంత క్రేజ్ సినిమా హీరోల‌కు కూడా ఉండ‌దేమో అనిపిస్తుంది.

 Netizens Compare Young Cricketers With Kapil Dev .. Seriously Gavaskar, Gavaskar-TeluguStop.com

అయితే వీరి గురించి ఏ చిన్న వార్త అయినా స‌రే ఇట్టే వైర‌ల్ అయిపోతుంది.ఇక‌పోతే క్రికెట్‌లో కొంద‌రు మాత్ర‌మే లెజెండ్స్‌గా పేరు తెచ్చుకున్నారు.

ఇందులో చాలా వ‌ర‌కు క్రికెట‌ర్లు వ‌చ్చి ఆడుతున్నా కూడా అందులో కొంద‌రు మాత్ర‌మే సుదీర్ఘ‌కాలం ఆడి పేరు సంపాదించుకుంటున్నారు.ఇక ఇలా పేరు తెచ్చుకుంటున్న వారిని కొంద‌రు మాజీ దిగ్గ‌జాల‌తో పోల్చ‌డం అభిమానుల‌కు అల‌వాటే మ‌రి.

అయితే అప్ప‌ట్లో హార్దిక్ పాండ్య ఆడిన ఆట‌ను చూసి అభిమానులు ఆయ‌న్ను మరో కపిల్ దేవ్ అంటూ పొగిడేశారు.ఎందుకంటే హార్డ్ హిట్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న హార్దిక్ పాండ్య చాలా వ‌ర‌కు బౌలింగ్ లో కూడా రాణించాడు.

దీంతో ఆయ‌న్ను అంద‌రూ కూడా క‌పిల్ దేవ్ లాగే మార్చేశారు.అంతటా ఆయ‌నకు కీర్తనలే వినిపించేవి.అయితే ఇలా పొగిడినంత మాత్రాన ఆయ‌న ఎప్ప‌టికీ అలా ఆడ‌లేడు గ‌దా.కొన్ని రోజుల త‌ర్వాత హార్దిక్ ఫెయిల్ అవుతున్నాడు.

మొన్న ఆస్ట్రేలియాలో, ఆ త‌ర్వాత శ్రీలంకలో వ‌చ్చిన ఐపీఎల్ ల‌లో కూడా ఏమాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయారు.

Telugu England, Gavaskar, Hardik Pandya, Kapil Dev, Shardul Takur, Ups, India-La

ఇక ఇప్పుడు శార్దూల్ ఠాకూర్ ను కూడా ఇలాగే పొగిడేస్తున్నారు.ఎందుకంటే రీసెంట్ గా ఇంగ్లండ్‌లో జ‌రుగుతున్న నాలుగు టెస్టులు ఆడిన శార్దూల్ ఏకంగా మూడు హాఫ్ సెంచరీలు న‌మోదు చేసి రికార్డులు సృష్టించాడు.ఈ లెక్క‌ల‌ను బ‌ట్టి చూస్తే ఆయ‌న ఓవల్ టెస్టు మ్యాచ్ లో కీలకంగా రాణించాడని చెప్పాలి.

ఇక ఆయ‌న్ను కూడా న‌యా క‌పిల్ దేవ్ అంటూ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.అయితే దీనిపై మాజీ కెప్టెన్ గావస్కర్ సీరియ‌స్‌గా స్పందించారు.కపిల్ దేవ్ లాంటి ఆల్ రౌండర్ క్రికెట్ చ‌రిత్ర‌లో ఒక్క‌డేన‌ని, అలాంటి వారు ఇక‌పైరార‌ని, అన‌వ‌స‌రంగా కుర్రాళ్లపై అంచ‌నాలు పెంచేసి వారి కెరీర్ ను చెడ‌గొట్టొద్ద‌ని సూచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube