మోడీ ప్రభుత్వాన్ని వణికిస్తున్న అగ్రహీరో సినిమా డైలాగులు

మెర్సల్ … ఇప్పుడు జాతియా మీడియాలో ఎక్కడ చూసిన ఈ సినిమా చర్చలే.ఈ సినిమా డైలాగులే కాంగ్రెస్ పార్టీకి ఆయుధాలయ్యాయి.

 This Is What Mersal Dialogue Says Against Bjp Government 1-TeluguStop.com

మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం నోట వినిపిస్తున్నాయి.బిజెపి ప్రభుత్వాన్ని వణికిస్తున్నాయి.దాంతో చిత్రంలోని ఆ సన్నివేశాన్ని తొలగించాలని, లేదంటే డైలాగులని మ్యూట్ చేయాలని బిజీపి పార్టీ డిమాండ్ చేస్తోంది.ఇంతకి ఆ చిత్రంలోని ఆ డైలాగులలో అంతలా ఉన్నది ఏమిటి?

“సింగపూర్ లో ప్రజలు 7% GST కడుతున్నారు.వారికి ఉచితంగా మెడిసిన్స్ అందుతున్నాయి.

మరి భారత ప్రభుత్వం 28% GST వసూలు చేస్తూ కూడా ఉచిత వైద్య సేవలు ఎందుకు అందించాలేకపోతోంది? మెడిసిన్స్ పై 12% GST కడుతున్నాం, కాని మద్యంపై మాత్రం GST లేదు.ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఆక్సిజన్ సిలండర్స్ ఉండటం లేదు.

ఆక్సిజన్ సిలిండర్స్ లేకపోవడానికి కారణం ఏమిటో అర్థం కావడం లేదు.రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం దగ్గర ఆక్సిజన్ సిలిండర్స్ ఇచ్చే డబ్బు లేకుండాపోయిందా? మరో గవర్నమెంట్ హాస్పిటల్ లో వైద్యం మధ్యలో పవర్ కట్ వలన నలుగురు చనిపోయారు.పవర్ బ్యాకప్ లేక మనుషులు చనిపోవడం సిగ్గుచేటు.ఇంకో ప్రభుత్వ హాస్పిటల్ లో పసికందుని ఇంక్యుబెటార్ లో ఉంచితే ఎలుక కుట్టి చనిపోయింది.ప్రజలు ప్రభుత్వ హాస్పిటల్స్ అంటే భయపడుతున్నారు.ఆ భయమే ప్రైవేట్ హాస్పిటల్స్ యొక్క పెట్టుబడి”

ఇదండీ .మెర్సల్ చిత్రంలో విజయ్ చెప్పిన ఆ తమిళ డైలాగ్ కి అనువాదం.మెడికల్ మాఫియా మీద ఈ చిత్రం ఇప్పుడు దేశవ్యాప్త సంచలనం.

ఈ చిత్రంపై బిజీపి నాయకులు దాడికి దిగుతున్నారు.మన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ రచనా సహకారం అందించిన ఈ చిత్రం తెలుగులో “అదిరింది” ఏరుతో అనువాదం అవుతోంది.

వచ్చే వారం విడుదల కానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube