మేనేజర్ కు 3 కోట్లు ఇచ్చిన సమంత.! ఎందుకో తెలుస్తే తప్పక అభినందిస్తారు!

స్టార్ హీరోయిన్ ,అక్కినేని కోడలు సమంతా ఇప్పటికే ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవాకార్యక్రమాలు చేస్తుంది.అక్కినేని కోడలు సమంత మరోమారు తన మంచి మనసును చాటుకుంది.

 మేనేజర్ కు 3 కోట్లు ఇచ్చిన సమం�-TeluguStop.com

సమంత దగ్గర ఎప్పట్నించో మహేందర్ అనే వ్యక్తి సౌత్‌లో మేనేజరుగా చేస్తున్నాడు.అతను ఈ మధ్య డబ్బులకోసం ఇబ్బంది పడుతుంటే ఆ ఇబ్బందిని గమనించిన సమంతా డబ్బు ఇచ్చిందనే వార్త ఒకటి ప్రచారం జరుగుతుంది.ఆ వార్త వివరాలు


మహేందర్ సమంతాకి మేనేజర్ గా ఉండడంతోపాటు నిర్మాతగా కొన్ని చిన్న చిన్న సినిమాలను నిర్మించాడు.తాజాగా నారా రోహిత్ హీరోగా ‘ బాలకృష్ణుడు ’ అనే సినిమాను నారా రోహిత్‌తో కలిసి నిర్మించాడు మహేందర్.కాగా సినిమా తుది దశలో వుండగా డబ్బులు తక్కువ పడ్డాయట.ఏం చెయ్యాలో, ఎవర్ని అడగాలో తెలియక మహేందర్ సతమతమవుతున్నప్పుడు, సమంత అతని ఇబ్బందిని గమనించి రూ.3 కోట్లు సహాయం చేసిందట.సినిమా ట్రైలర్ చూసి తప్పకుండా సినిమా విజయాన్ని సాధిస్తుందనే ధీమాతోనే ఈ సహాయం చేసిందట సమంతా.

అయితే కొన్ని ఏరియాల్లో రైట్స్ పరంగా సమంత డీల్ సెట్ చేసుకుంది అందుకే డబ్బు ఇచ్చింది అనే వాదన వినిపిస్తుంది.అంటే ఓ విధంగా బిజినెస్ అనుకోవచ్చు


మేనేజర్ మాత్రం సమంత చేసిన సహాయానికి ఆమెకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అంటున్నాడు.గతంలో ‘ ప్రత్యూష ’ ఫౌండేషన్ ద్వారా సమంత 15 మంది అనాధ పిల్లలకు ఉచితంగా కార్డియాక్ సర్జరీలు చేయించి తన ధాతృత్వాన్ని చాటుకున్న విషయం తెలిసిందే…ఇప్పుడు కూడా బయటివాళ్లు బిజినెస్ అంటున్నప్పటికీ దాన్ని సాయంగానే చూడాలి.ఎందుకంటే తిరిగి డబ్బివ్వకుండా సినిమాలాభాల్లో వాటా ఇస్తే తప్పులేదు కదా.టైం కి సాయం చేసారా లేదా అనేది ముఖ్యం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube