ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ తో టీడీపీ చేస్తున్న మంతనాలపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు.
మెటీరియల్ మంచిది కాకపోతే మేస్త్రి ఏమి చేయగలడని మంత్రి అంబటి ప్రశ్నించారు.
అయితే ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారన్న సంగతి తెలిసిందే.ఇప్పటికే లోకేశ్ తో కలిసి హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకున్న ఆయన చంద్రబాబుతో సమావేశం అయ్యారు.
వీరిద్దరి భేటీ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.అయితే ప్రశాంత్ కిషోర్ గత ఎన్నికల్లో వైసీపీకి వ్యూహకర్తగా పని చేసిన సంగతి తెలిసిందే.