మార్నింగ్‌ వాక్‌కి వెళ్లి.. మిస్సయిన ఎన్ఆర్ఐ యువతి, గంటల్లో ఛేదించిన పోలీసులు

దుబాయ్‌లో ఓ ఎన్ఆర్ఐ యువతి ఎప్పటిలాగే తెల్లవారుజామున మార్నింగ్ వాక్‌కు వెళ్లింది.ప్రతినిత్యం ఒక అర్థగంట సేపు వాకింగ్ చేసి తిరిగి ఇంటికొచ్చేది.

 Indian Girl Who Went Missing In Dubai Found Safe Family, Dubai, Nri Girl, Harini-TeluguStop.com

కానీ గురువారం వాకింగ్‌కు వెళ్లిన ఆమె ఎంతకి రాలేదు.ఇంకొంచెంసేపట్లో వచ్చేస్తుందిలే అని తల్లిదండ్రులు భావించారు.

కానీ గంటలు గడుస్తున్నా తమ బిడ్డ ఇంటికి రాకపోవడంతో పేరెంట్స్‌లో కంగారు మొదలైంది.దేశం కానీ దేశం.

దీంతో తమ కూతురు క్షేమ సమాచారం కోసం వారిలో ఆందోళన మొదలైంది.రోజూ వాకింగ్ చేసే చోట, ఇంకొన్ని ప్రాంతాల్లో వెతికారు అయినా ఫలితం శూన్యం.

చివరికి ఆమె స్నేహితుల్ని, బంధువుల్ని ఎంక్వయిరీ చేశారు.వారి నుంచి మాకు తెలియదనే సమాధానం రావడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు గంటల వ్యవధిలోనే ఆమెను ట్రాక్ చేసి రాత్రికి తల్లిదండ్రుల వద్దకు క్షేమంగా చేర్చారు.

వివరాల్లోకి వెళితే.

దుబాయ్‌లోని ఉమ్ సుకీమ్ 2లో నివాసముండే 16 ఏళ్ల భారతీయ యువతి హరిణీ కరణి.ఆమె స్థానిక అల్ బర్సాలోని జీఈఎంఎస్ ఫౌండర్ స్కూల్‌లో 11‌వ తరగతి చదువుతోంది.ప్రతిరోజూ మార్నింగ్ వాక్ చేసే అలవాటున్న హరిణీ.ఎప్పటిలాగానే గురువారం ఉదయం 6.30 గంటలకు బయటకు వెళ్లింది.వాకింగ్‌కు వెళ్లి మళ్లీ అర్ధ గంట తర్వాత ఇంటికి తిరిగి వచ్చేసేది.

కానీ, గురువారం మాత్రం హరిణి ఎంతసేపటికీ తిరిగి ఇంటికి రాలేదు.దీంతో తల్లిదండ్రులు హరిణీ కోసం చుట్టుపక్కల గాలించారు.

తెలిసిన వారిని, సన్నిహితులను వాకాబు చేశారు.కానీ, బిడ్డ ఆచూకీ మాత్రం దొరకలేదు.

దీంతో చేసేదేమీ లేక అదే రోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో 999కు కాల్‌చేసి పోలీసులకు సమాచారం అందించారు.వాకింగ్‌కని వెళ్లిన కూతురు తిరిగి ఇంటికి రాలేదని ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు గురువారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో హరిణి జాడను కనుగొన్నారు.ఆమెను అదుపులోకి తీసుకుని తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు.అంతా బాగానే వుంది కానీ.ఉదయం 6.30 గంటల నుంచి ఆమె ఎక్కడికి వెళ్లింది, ఏం చేసింది అన్న దానిపై క్లారిటీ రావాల్సి వుంది.హరిణీని ఎవరైనా కిడ్నాప్ చేశారా.? లేదంటే ఆమె తనకు తానుగా ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.అయితే హరిణి క్షేమంగా ఇంటికి తిరిగి రావడంతో ఆమె తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.తమ కూతురిని క్షేమంగా తీసుకొచ్చిన దుబాయ్ పోలీసులకు వారు ధన్యవాదాలు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube