మహేష్ కి అవమానం, డబ్బులు వెనక్కి తీసుకున్న బయ్యర్లు

సినిమా ఇండస్ట్రీ అంటే కోట్ల వ్యాపారం, వ్యవహారం.ఒక్కరాత్రిలో ధనవంతుడు అయినవాడు, మరోరాత్రి రోడ్డు మీద పడేది తెలియదు.

సినిమా సినిమాకి జాతకాలు మారిపోతూ ఉంటాయి.ఒక హీరో సినిమా కొని కోటీశ్వరులు అయిన పంపిణిదారులు ఉన్నారు, అదే హీరోకి చెందిన మరో సినిమా కోని ఆత్మహత్యలు చేసుకున్న బయ్యర్లు కూడా ఉన్నారు.

సినిమా ఎలా వచ్చేది బయ్యర్ల చేతిలో ఉండదు, అంతా వారి అదృష్టం, దురదృష్టమే.కాంబినేషన్ చూస్తారు, ట్రైలర్ చూస్తారు, హీరోని నమ్ముతారు, కొంటారు అంతే.

మహేష్ బాబు - మురుగదాస్ కాంబినేషన్లో సినిమా అనగానే మంచి అంచనాలు పుట్టాయి ఇండస్ట్రీలో, ట్రేడ్ లో.మురుగదాస్ కి తమిళంలో మంచి సక్సెస్ రేటు ఉంది.ఆయన తీసే సినిమాలు తెలుగులోకి అనువాదం కూడా అవుతాయి.శంకర్ మాదిరి మార్కెట్ లేకపోయినా, మురుగదాస్ అంటే ఏంటో కనీసం ఏ సెంటర్ ఆడియెన్స్ వరకైనా తెలుసు.100 కోట్ల బడ్జెట్ అన్నారు, భారి యాక్షన్ సన్నివేశాలు అన్నారు.దాంతో హైప్ బాగా వచ్చింది.

Advertisement

కాని ఆ సినిమా ప్రోమోలే, ఇంతవరకు పెద్దగా మెప్పించలేదు.మొన్నటి టీజర్ రాకముందు వరకు ఇదేదో బాగా క్లాస్ గా ఉంది అన్నారు, ఇక మొన్నటి టీజర్ వచ్చాకా, ఇది క్లాస్ ఆడియెన్స్ ని అయినా మెప్పిస్తుందా లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి.

ఒక్కసారిగా స్పైడర్ చుట్టూ నెగెటివ్ వైబ్స్.ఆ నెగెటివ్ తరంగాలు బయ్యర్లని కూడా తాకాయి.

నెల్లూరులో స్పైడర్ తీసుకుందామనుకున్నా బయ్యర్లు, కట్టిన డబ్బు మళ్ళీ వెనక్కి తీసుకున్నారని తెలుస్తోంది.మహేష్ ఫామ్ బాగా లేకపోవడం వల్లో లేక స్పైడర్ ప్రోమోలు ఆసక్తికరంగా అనిపించకపోవడం వల్లో తెలియదు కాని, కొత్త పంపిణిదారులని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని టాక్.

మరి ఇందులో నిజమెంతో, అబద్ధమెంతో తెలియాలి.మరోవైపు క్లాస్ సెంటర్స్ గా పేరున్న ఓవర్సీస్, నైజాంలో మాత్రం స్పైడర్ కి భారి డిమాండ్ ఉంది.

కీళ్ల నొప్పుల నుంచి మ‌ల‌బ‌ద్ధ‌కం నివార‌ణ వ‌ర‌కు ఆముదంతో ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా?
అల్లు అర్జున్ విషయం లో లాయర్ నిరంజన్ రెడ్డి ఏం చేస్తున్నారు...

ఇప్పటికే ఓవర్సీస్ డీల్స్ ఎవరు ఊహించని రికార్డు స్థాయిలో పూర్తయ్యాయి.ఇక నైజాంలో కొత్త నాన్ - బాహుబలి రికార్డు తథ్యం.

Advertisement

తాజా వార్తలు