సంపూర్ణ మద్య నిషేదం తర్వాతే ఎన్నికలకు వెళ్తాం

ఏపీలో తమ ప్రభుత్వం సంపూర్ణ మద్యపాన నిషేదం చేయబోతున్నట్లుగా మంత్రి నారాయణ స్వామి ప్రకటించాడు.తాము అధికారంలోకి రాకముందు నుండే సంపూర్ణ మద్యపాన నిషేదం గురించి చెబుతూ వస్తున్నాం.

 Apexcise Ministernarayanaswamy On Liquorban Ap-TeluguStop.com

గత ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటూ వచ్చాయి.తాము మాత్రం దశల వారిగా మద్య పాన నిషేదం చేస్తామంటూ మంత్రి క్లారిటీ ఇచ్చారు.

ఇప్పటికే రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్‌ విధానంను తీసుకు వచ్చామని అందులో భాగంగా వైన్‌ షాప్‌ల సంఖ్యను భారీగా తగ్గించాం.బెల్ట్‌ షాపులు లేకుండా జాగ్రత్త పడుతున్నాం.

వచ్చే ఏడాది వైన్‌ షాపుల సంఖ్య ఇంకా తగ్గించబోతున్నట్లుగా ఆయన పేర్కొన్నాడు.

మద్యంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి.

రాష్ట్రంలోని ఆడపడుచుల కష్టాలను కళ్లార చూసిన జగన్‌ మోహన్‌ రెడ్డి గారు సంపూర్ణ మద్యపాన నిషేదం చేయాల్సిందే అనే నిర్ణయానికి వచ్చారు.గతంలో ఎన్టీఆర్‌ హయాంలో సంపూర్ణ మద్యపాన నిషేదం జరిగింది.

ఇప్పుడు అదే తరహాలో వైకాపా ప్రభుత్వం సంపూర్ణ మద్యపాన నిషేదం చేయాలని నిర్ణయించుకుంది.ఇందుకోసం దశల వారిగా అమలు చేస్తున్నాం.రాబోయే అయిదు సంవత్సరాల్లో పూర్తిగా మద్యంను నిషేదించడమే వైకాపా ప్రభుత్వ లక్ష్యం.2024 సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికలకు మద్యపాన నిషేదించిన తర్వాతే వెళ్తామని మంత్రి అన్నారు.కొత్త ఎక్సైజ్‌ పాలసీపై ప్రతిపక్ష పార్టీలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయంటూ మంత్రి అన్నారు.రాష్ట్రంలో ముందు ముందు మద్యం పూర్తిగా కనుమరుగవ్వనుందని ఆయన అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube