మంత్రి ప‌ద‌వే టార్గెట్‌... వైసీపీలోకి టీడీపీ ఎంపీ జంప్‌..!

ఏపీలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్క‌డంతో జంపింగ్ జ‌పాంగ్‌లు త‌మ జంపింగ్‌లు ముమ్మ‌రం చేసేశారు.ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు జంప్ చేస్తున్నారు.

 Avanthi Srinivas Join Ysrcp-TeluguStop.com

అధికార పార్టీలో ఉన్న‌వాళ్ల‌కు ఇక్క‌డ అనుకూల వాతావ‌ర‌ణం లేక‌పోవ‌డంతో పాటు వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము కోరుకున్న సీటు రాద‌నుకున్న ప‌క్షంలో వైసీపీలోకి జంప్ చేసేస్తున్నారు.నిన్న మొన్న‌టి వ‌ర‌కు విప‌క్ష వైసీపీ నుంచి అధికార పార్టీలోకి ఎక్కువ జంపింగ్‌లు జ‌రిగాయి.

ఇప్పుడు అక్క‌డ బండి ఓవ‌ర్ లోడ్ అవ్వ‌డంతో ఇప్పుడు అక్క‌డ నాయ‌కులు అంద‌రూ ఛాన్స్‌ల కోసం వైసీపీయో లేదా జ‌న‌సేన వైపో చూస్తున్నారు.

తాజాగా ఇప్పుడు ఈ లిస్టులోనే తెలుగుదేశం పార్టీకి చెందిన అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు కూడా ఉన్న‌ట్టు తెలుస్తోంది.

అవంతి ఈ సారి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అసెంబ్లీకే పోటీ చేయాల‌ని డిసైడ్ అయ్యారు.దీనిపై కొద్ది రోజులుగా ఆయ‌న ఫ్రీల‌ర్లు వ‌దులుతున్నారు.ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఈ సారి తాను అసెంబ్లీకి అది కూడా భీమిలి నుంచే పోటీ చేసి మంత్రి అవ్వ‌డ‌మే టార్గెట్‌గా పెట్టుకున్నార‌ని స‌న్నిహితుల ద్వారా తెలుస్తోంది.

2009 ఎన్నికల్లో అవంతి శ్రీనివాసరావు ప్రజారాజ్యం పార్టీ తరఫున భీమిలి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.గత ఎన్నికల ముందు టీడీపీలో చేరి అనకాపల్లి ఎంపీగా పోటీచేసి గెలుపొందారు.ఆయ‌న ముందు గంటా బ్యాచ్‌లోనే ఉండేవారు.

త‌ర్వాత గంటాకు ఆయ‌న‌కు గ్యాప్ వ‌చ్చింది.దీనికి చాలా కార‌ణాలు ఉన్నా అవంతి భీమిలి నుంచి పోటీ చేస్తాన‌ని చెపుతోన్న ప్ర‌క‌ట‌న‌లే గంటా మంట‌కు కార‌ణ‌మ‌య్యాయి.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న విశాఖ‌లో గంటా వ్య‌తిరేక బృందానికి ద‌గ్గ‌ర‌య్యారు.ఇక వేళ వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి భీమిలి సీటు రానిప‌క్షంలో ఆయ‌న వైసీపీలోకి అయినా జంప్ చేసి భీమిలి నుంచే పోటీ చేసే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు కూడా భీమిలిలో ప్ర‌చారం జోరందుకుంది.

భీమిలి వైసీపీ ప్రధాన కార్యదర్శి జి.వెంకటరెడ్డి అవంతి వైసీపీ ఎంట్రీని అడ్డుకోవాల‌ని సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతుండ‌డం కూడా ఇందుకు బ‌లాన్ని ఇస్తోంది.

విశ్వ‌సీన‌య వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం వైసీపీ నాయకత్వంతో అవంతి సంప్రదింపులు జరుపుతున్న‌ట్టు కూడా తెలుస్తోంది.గంటా మాత్రం భీమిలిని వ‌దులుకునేందుకు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ సుముఖంగా లేరు.వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న వార‌సుడిని కూడా పోటీ చేయించాల‌ని అనుకుంటోన్న గంటా భీమిలి, చోడ‌వ‌రం రెండు సీట్ల‌పై క‌న్నేశారు.దీంతో ఆయ‌న భీమిలి వ‌దుల‌కునేలా లేరు.

మ‌రి ఎలాగైనా భీమిలి నుంచి పోటీ చేయాల‌నుకుంటోన్న అవంతి ఏం చేస్తారో ? ఇప్పుడు స‌స్పెన్స్‌గా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube