భారత టెకీ లకి ఊరట.. హెచ్‌1-బీ పై గుడ్ న్యూస్

తమ దేశ పౌరులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలలో భాగంగా హెచ్‌1-బీ ట్రంప్ విధించిన ఆంక్షలు అందరికి తెలిసినవే అయితే ఈ ఆంక్షల వలన భారత ఎన్నారైలు ఎంతగా ఇబ్బంది పడ్డారో వేరే చెప్పనవసరం లేదు.అయితే ఈ క్రమంలోనే ఢిల్లీలోని అమెరికా డిప్యూటీ చీఫ్‌ ఆఫ్ మిషన్‌ మేరీ కే ఎల్‌ కార్ల్‌సన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

 No Changes In H1b Visa Rules-TeluguStop.com

హెచ్‌1-బీ వీసా ప్రోగ్రాంలో పెద్దగా మార్పులేమీ లేవని.అలాగే హెచ్‌-4 వీసాల్లోనూ కొత్త మార్పులేమీ చేయట్లేదని ర్ల్‌సన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.అమెరికా ప్రభుత్వం వీసా విధానాల్లో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం… భారత్‌, అమెరికాల మధ్య ఉన్నత విద్యకు సంబంధించిన సంబంధాల నేపథ్యంలో చేపట్టిన ఒక కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు

ఈ సందర్భంలో ఆమె మాట్లాడుతూ 2017లో 186,000 మందికి పైగా భారతీయ విద్యార్థులు అమెరికాలో ఉన్నత విద్యాసంస్థల్లో చేరారని దశాబ్దంతో పోలిస్తే రెండింతలు, అంతకుముందు ఏడాదితో పోలిస్తే 12 శాతం పెరిగారని ఆమె మీడియాకి తెలిపారు.

మొత్తం అంతర్జాతీయ విద్యార్థుల్లో 17 శాతం మందితో భారత్ రెండవ స్థానంలో ఉందని కార్ల్‌సన్‌ వెల్లడించారు.అయితే కార్ల్‌సన్ ఈ ప్రకటనతో భారత టెకీ లకి కొంత ఊరట కలిగించింది…అమెరికాలో హెచ్ -1బీ ఆంక్షల వలన తలెత్తే ఆర్ధిక ఇబ్బందుల దృష్ట్యా అమెరికా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉండి ఉంటుందని భావిస్తున్నారు నిపుణులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube