బాబు సొంతింట్లో టీడీపీ జెండా క‌ష్ట‌మేనా..!

విప‌క్షం వైసీపీ నుంచి 2014లో చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలుపొందారు చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి.అధికార పార్టీ టీడీపీ నేత‌ల‌కు ఈ పేరంటేనే పెద్ద వివాదం! ఈ పేరు విన‌బడితే.

 Chandrababu Chandragiri-TeluguStop.com

అసెంబ్లీ వంటి ప్రాంగ‌ణాల్లో ఈయ‌న క‌నిపిస్తే.టీడీపీ నాయ‌కులు ఎవ‌రికి వారు జాగ్ర‌త్త ప‌డిపోతారు.

మ‌రి అలాంటి నాయ‌కుడిపై చంద్ర‌గిరి ఎమ్మెల్యేలు ఏమ‌నుకుంటున్నా రు? వ‌చ్చే ఎన్నిక‌ల్లో చెవిరెడ్డిని గెలిపిస్తారా? లేక ఆయ‌న దూకుడుతో త‌ట్టుకోలేక ప‌క్క‌న పెడ‌తారా? ఇలాంటి ఆస‌క్తిక‌ర అంశాల‌పై దృష్టి పెడితే.మ‌రింత ఆస‌క్తిక‌ర స‌మాధానం ల‌భిస్తోంది.

ఆయ‌న ప్ర‌తిప‌క్షంలో ఉన్నా.కూడా త‌న సొంత వ్యాపారాల నుంచి వ‌స్తున్న డ‌బ్బును ప్ర‌జ‌ల శ్రేయ‌స్సుకు మ‌ళ్లిస్తున్నారు.

నిత్యం ప్ర‌జ‌ల్లో ఉంటున్నారు.అధికార పార్టీ నేత‌లపై విరుచుకు ప‌డుతున్నారు

దీంతో చెవిరెడ్డికి ఫాలోయింగ్ పెరుగుతోంది.అభివృద్ధి చేయ‌లేక‌పోయారు క‌దా? అని నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌శ్నిస్తే.ఏది ఆయ‌న అధికార పార్టీలో లేడు క‌దా? అంటూ ఎదురు ప్ర‌శ్నిస్తున్నారు.ఇలా మొత్తంగా చెవిరెడ్డి ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో చొచ్చుకుపోయారు.సొంత పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎంపీ ల్యాడ్స్‌ నుంచీ రూ.56 లక్షలతో పంచాయతీలకు 8 ట్రాక్టర్లు, 8 ట్యాంకర్లు మంజూరు చేయించారు.జాతర్లకు, ఉత్సవాలకు విరాళాలివ్వడం, వినాయక చవితికి విగ్రహాలు పంపిణీ చేయడం, క్రమం తప్పకుండా క్రీడా పోటీలు నిర్వహించడం, ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రతిభావంతులైన విద్యార్థులకు బహుమతులివ్వడం తరహా కార్యక్రమాలతో జనానికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.

రామచంద్రాపురం మండలం సి.రామాపురం నుంచీ తిరుపతి కార్పొరేషన్‌ డంపింగ్‌ యార్డును తొలగించాలని గ్రామస్తులు చేపట్టిన ఆందోళనకు మద్దతిచ్చిన చెవిరెడ్డి వారి మన్ననలు సంపాదించుకున్నారు.ఎమ్మెల్యే నిధులు కూడా ప్రభుత్వం ఇవ్వకపోవడంతో సమస్యలు పరిష్కరించలేకపోవ‌డం ఇక్క‌డ క‌నిపిస్తున్న మైన‌స్‌.అయితే నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీలకతీతంగా అందరినీ కలుపుకుని పోతున్నారు ఎమ్మెల్యే.ఏటా యువతకు క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులిస్తున్నారు.ఉత్సవాలు, జాతర్లకు సారెతో పాటు విరాళాలిస్తున్నారు.

వినాయక చవితికి ఏటా విగ్రహాలిస్తున్నారు

చంద్రగిరి పంచాయతీలో వేలం పాట దక్కించుకుని రైతుల నుంచీ పన్ను వసూలు చేయకుండా వారు కూరగాయలు విక్రయించుకునే అవకాశం కల్పించారు.ఉద్యోగులు, అధికారులు, పార్టీలతో నిమిత్తం లేకుండా ప్రజాప్రతినిధులకూ ఏటా స్వీట్లు, బట్టలు పెట్టి గౌరవిస్తున్నారు.

పేద పిల్లలకు ఉచితంగా దుస్తులు, పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు.తుమ్మలగుంటలో కళ్యాణ మండపం కట్టిస్తున్నారు.

అక్కడ పెళ్ళి చేసుకునే జంటలకు తాళిబొట్లు, మెట్టెలు, వస్త్రాలు ఇస్తున్నారు.ఎవరొచ్చినా పార్టీలకు అతీతంగా స్పందించి వారి సమస్యల పరిష్కారానికి పోరాడుతున్నారు .మొత్తానికి ఈ ప‌రిణామాలు చెవిరెడ్డికి పాజిటివ్‌గా మారాయి.

ఏదేమైనా ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత ఇలాకాలో టీడీపీ జెంగా ఎగిరి దాదాపు రెండున్న‌ర ద‌శాబ్దాలు అవుతోంది.

మ‌రి ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా క‌నీసం ఇక్క‌డ టీడీపీని గెలిపించాల‌ని ఆయ‌న విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నా చెవిరెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలో దూసుకు వెళుతోన్న తీరుతో ఆ ప‌రిస్థితి అయితే క‌న‌ప‌డ‌డం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube