ప్రజల మద్దతు ఏ పార్టీకి అంటే..? ఆ సర్వే లో తేలింది ఇదే !

రాజకీయ పార్టీలకు సర్వేలు చేయించుకోవడం అలవాటే.ఆ సర్వేల ద్వారా రాష్ట్రంలో తమ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు .? ఇంకా తమ నుంచి ఏమి ఆశిస్తున్నారు.? అనే విషయాలను పూర్తిగా తెలుసుకుంటారు.తద్వారా తమ ఎత్తులు పై ఎత్తులు అమలుచేస్తుంటారు.ఇది అన్ని పార్టీల్లోనూ సర్వ సాధారణంగా ఉండేదే .ఇక ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేస్తుండడంతో ఈ సర్వేలకు బాగా డిమాండ్ కూడా పెరుగుతుంది.అయితే ఇటీవల కర్ణాటక ఫలితాల మీద సర్వే చేసిన సంస్థ ఏపీలో కూడా తాజాగా సర్వే చేపట్టిందట.దీంట్లో దిమ్మతిరిగే విషయాలు బయటపడడంతో రాజకీయ పార్టీల్లో కంగారు మొదలయ్యింది

 Ycp Tdp Bjp 2019 Elections Survey-TeluguStop.com

ఆ సర్వే సంస్థ బయటపెట్టిన వివరాల ప్రకారం .ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరు బాగుందని.ఆయన వల్లే రాష్ట్రం ఎటువంటి ఆర్ధిక ఇబ్బందులు లేకుండా ముందుకు ముందుకు వెళ్తోందని ఎక్కువమంది సంతృప్తి వ్యక్తం చేశారట.పెన్షన్‌.రేషన్‌ నెలనెలా అందుతోందని.చంద్రబాబు బాగా కష్టపడుతున్నాడని, గ్రామాలలో రోడ్లు వేస్తున్నారని.

విద్యుత్‌ సరఫరా బాగుందని పలువురు సర్వే సంస్థకు వివరించారు.కేంద్రం అన్యాయం చేసిందని చాలా మంది చెప్పారట.

అయితే కొంతమంది మాత్రం రాజధాని నిర్మాణం ఇంకా ప్రారంభం కాకపోవడం పై అసంతృప్తి వ్యక్తం చేశారని తెలిసింది.సకాలంలోనే పోలవరం పూర్తవుతుందనే విశ్వాసం ఎక్కువమంది వ్యక్తపరిచారట.

కానీ అంతా బాగానే ఉంది కానీ.ఎమ్మెల్యేల అవినీతిపై చాలామంది పెదవి విరిచారు.

గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ కార్యాలయాలలో పనులు చకచకా జరిగేవని.ప్రస్తుతం పనులు జరగకపోగా.

అవినీతి పెరిగిపోయిందని నిరసన వ్యక్తం చేశారు.కొన్ని ప్రధాన నగరాలలో ప్రజా ప్రతినిధుల పనితీరుపై సర్వేలో అసంతృప్తి వ్యక్తమయ్యింది

జగన్‌ పాదయాత్ర నిర్వహించిన మార్గాలలో కూడా ఈ సంస్థ సర్వే జరిపింది.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడాన్ని చాలామంది తప్పుపట్టారు.తాను అధికారంలోకి వస్తే పెన్షన్‌లను పెంచుతానని.

అర్హత వయసును 45 సంవత్సరాలుగా చేస్తానని జగన్‌ చెప్పిన మాటలు పేదవర్గాల్లోకి వెళ్లాయని సర్వేలో తేలింది.జగన్‌కు గత ఎన్నికలలో మద్దతు ఇచ్చిన వర్గాలలో ముఖ్యంగా ముస్లింలలో కొంతమార్పు కనిపిస్తుందని స్పష్టమయ్యింది.

హోదా కోసం జగన్ చేస్తున్న పోరాటం గురించి ప్రస్తావించగా.అందరూ చేస్తున్నారుగా అన్న సమాధానం వచ్చిందట!

అయితే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న వారు మాత్రం ప్రస్తుత పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నారని.

వారు ఎటువైపుకు మొగ్గుతారనేది ఇంకా తేల్చుకోలేదన్నది సర్వే సారాంశం.బీజేపీకి వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ దగ్గరయ్యిందంటూ టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని పలువురు నమ్ముతున్నారట! జగన్‌ పాదయాత్రలో స్థానిక సమస్యలను ప్రస్తావించకుండా చంద్రబాబును తిట్టేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని పలువురు వ్యాఖ్యానించినట్టు సర్వే చెబుతోంది

జనసేనపార్టీ గురించి ప్రస్తావించగా.

పవన్‌ ఇంకా పూర్తిస్థాయిలో రాలేదు కదా అని కొందరు.ఆయన ఇంకా ప్రశ్నించాలని మరికొందరు వ్యాఖ్యానించారు.

సర్వే జరిగిన సమయానికి పవన్‌ బస్సుయాత్ర ఇంకా ప్రారంభం కాలేదు.కేంద్రంపై ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర వ్యతిరేకత ఉందని సర్వేలో తేలింది.

ఈ సర్వే ఫలితాలు బయటికి రాకపోయినప్పటికీ, రెండు పార్టీల్లో ఉన్న కొంతమంది అగ్రనేతలకు మాత్రం తెలిసిపోయింది.కొంతమంది ఎమ్మెల్యేల అవినీతి, ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై తెలుగుదేశంపార్టీ నేతలకు ఇప్పటికే తెలుసు.

కానీ చంద్రబాబుపై ఉన్న సానుకూలత తమను కాపాడుతుందని నేతలు భావిస్తున్నారు.ఏమైనా ఈ సర్వే లెక్కల ప్రకారం టీడీపీ కి ప్రజల్లో మద్దతు బాగా ఉన్నట్టు అర్ధం అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube