పొట్ట క్యాన్స‌ర్‌కు ఈ కూర‌గాయ‌లే అస్త్రం

కూరగాయలు మనిషి ఆరోగ్యకరమైన జీవితంలో ఒక భాగం అయ్యాయి.కూరగాయలు తినడం వల్ల శరీరం ధృడంగా ఆరోగ్య వంతంగా ఉంటుంది అన్న విషయం అందరికి తెలిసినదే.

 Stomach Cancer Tips-TeluguStop.com

ఒక అడుగు ముందుకు వేసిన జెజియాంగ్ యూనివర్శిటీకి చెందిన చైనా శాస్త్రవేత్త ఒక గొప్ప సత్యాన్ని కనుగొన్నది.అదేమిటంటే తెల్లని కూరగాయలు రోజు తీసుకోవడం వలన పొట్టకి సంభందించిన క్యాన్సర్ రాకుండా కాపాడుతాయట.

ఆశ్చర్యపోతున్నారా ? ఆమె పరిశోధనని ఓ సారి ప‌రిశీలిస్తే…

ఆమె చేసిన ఈ అధ్యయనం లో బ్రిటన్‌లో ప్రతి రోజూ పొట్ట కేన్సర్ వ్యాధి కనీసం 13 మంది రోగులను బలి తీసుకొంటోందని, ఈ వ్యాధి వచ్చిన వాళ్లు పదేళ్ల కాలంలో 85 శాతం మంది మృత్యుముఖంలోకి వెళుతున్నారని కనుగొన్నారు.తెల్లటి కూరగాయలు అయిన కాలీఫ్లవర్ , బంగాళాదుంప, ఉల్లిపాయలు, క్యాబేజీ వీటిని తినడం వల్ల‌ పొట్ట క్యాన్సర్ వచ్చే అవకాసం లేదు అని , క్యాన్సర్ కంట్రోల్‌ చేయగలిగే శక్తి వాటికి ఉందని చెప్తోంది.

“సి” విటమిన్ తెల్లగా ఉండే కురగాయాలలో ఉంటుంది అని.ఇది పొట్టలో కణాల మీద ఒత్తిడికి వ్యతిరేకంగా యాంటి ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది.మనం తీసుకునే ఆహారంలో సుమారుగా 50 గ్రా ఆహారం వరకూ “సి” విటమిన్ ఉన్నట్లయితే పొట్ట క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని 8 శాతానికి తగ్గిస్తుంది అని పరిశోధనలో తేలింది.అంతేకాదు ప్రతీ జోరు పరగడుపున ఒక 50 గ్రాముల పండ్లని తీసుకోవడం వల్ల‌ పొట్ట క్యాన్సర్ 5 శాతానికి తగ్గిస్తుంది అని చెప్తున్నారు.

ఇంకెందుకు ఆలస్యం మీరు ఏమి తిన్నా దానిలో తెల్లని కూరగాయలు ఉండేలా ప్లాన్ చేసుకుని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube