పెళ్ళిలో వధువుకు "బాసికం" ఎందుకు కడతారో తెలుసా.? వెనకున్న అసలు కారణం ఇదే.!

హిందూ వివాహ పద్దతిలో జరిపే ప్రతి ఆచారం వెనుక కారణాలు, శాస్త్రీయమైన దృక్పథాలు దాగివున్నాయి.పెళ్లిలో వధువరులకు నుదుటన బాసికం కడుతారు.అది ఎందుకో, దాని వెనుకు వున్న అసలు కారణం ఏమిటో తెలుసుకుందాం

 Basikam Importance In Marriage-TeluguStop.com

మనిషి శరీరంలో 72వేల నాడులున్నాయి.వాటిలో 14 నాడులు చాలా ప్రముఖమైనవి.ఈ 14 నాడులలో ఇడ, పింగళ, సుషుమ్న అనే మూడు మరీ ముఖ్యమైనవి.వీటిలో సుషుమ్న అనే నాడికి కుడి వైపు సూర్యనాడి, ఎడమవైపు చంద్రనాడి వుంటాయి.

ఈ రెండూ కలిసేది ముఖంలోని నుదుటి మధ్య భాగం.ఈ రెండు నాడుల కలయిక అర్ధచంద్రాకారంలో వుంటుంది.

దీనిని దివ్యచక్షవు అని రుషులు అంటుంటారు.ఈ దివ్యచక్షువుపై ఇతరుల దృష్టి పడి దోషం కలుగకుండా వుండేందుకు వధువరుల నుదుట బాసికం కడతారు.బాసికం అర్ధచంద్రాకారంలో కానీ, త్రిభుజాకారంలో కాని వుంటుంది

శ్లోకం:

పుత్రిణేమా కుమారిణా విశ్వమాయుర్వ్యశ్నుతమ్‌।
ఉభా హిరణ్య పేశసా వీతిహోత్రా కృతద్వనూ॥

అర్థం:

వివాహ క్రతువు ముగిసిన తర్వాత నవదంపతులను ఆశీర్వదిస్తూ పెద్దలు చెప్పే శ్లోకం ఇది- ‘మిలమిల మెరిసే బంగారంలాగా ప్రకాశిస్తున్న ఈ దంపతులు… కొడుకులు, కూతుళ్లతో వంశాభివృద్ధి చెందాలి.ఎల్లప్పుడూ మంచిపనులు చేస్తూ, సిరిసంపదలను అనుభవిస్తూ దీర్ఘాయువులై చిరకాలం జీవించాలి’.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube