పిల్లి ఇలా ఎదురు వస్తే మంచిదేనా.. వేద పండితులు ఏమి చెబుతున్నారంటే..

మన దేశంలో శకునాలను దాదాపు అన్ని మతాలవారు బాగా నమ్ముతారు.అందులో కామన్ గా ఉండేది.

 Is It Good If The Cat Meets Like This.. What Do The Veda Panditulu Say  , Veda-TeluguStop.com

ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తుంటే పిల్లి ఎదురొచ్చిందంటే అది చెడు శకునం అని, ఆ పని అస్సలు జరగదని భావిస్తూ ఉంటారు.మళ్ళీ ఇంట్లోకి వచ్చి కాసేపు కూర్చొని వెళ్తుంటారు.

ఇలాంటివి మన దేశంలో చాలామందిలో ఉన్నాయి.అసలు పిల్లి( Cat ) ఎదురు రావడం అశుభమేనా అంటే కాదని వేద పండితులు చెబుతున్నారు.

పిల్లి ఎలా వస్తే మంచిది.ఎలా వస్తే మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం.మనం ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లేటప్పుడు పిల్లి ఎలుకను నోట్లో పట్టుకొని ఎదురు వస్తే మనం వెళ్లే పని విజయవంతం అవుతుంది అని వేద పండితులు చెబుతున్నారు.పిల్లి కనుక మనతో పాటు ఇంట్లో నుంచి బయటకు వస్తే కార్యసిద్ధి కలుగుతుందని చెబుతున్నారు.

బయటకు వెళ్ళేటప్పుడు రెండు పిల్లులు గొడవ పడుతూ ఎదురుపడితే మనం చేయబోయే పనిలో గొడవలు వస్తాయని చెబుతున్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే పిల్లిని కుక్కలు( Dog ) తరుముకుంటూ మన ఎదురుగా వస్తే శత్రుభయం, ధన నష్టం కలుగుతుందని చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే పిల్లి తన పిల్లలను 7 ఇళ్లకు మారుస్తుంది.ఇలా కనుక పిల్లి తన పిల్లలను నోట్లో పట్టుకుని మనకు ఎదురు వస్తే మనం చేయబోయే పనిలో ఆటంకాలతో పాటు స్థానాచలనం కూడా కలుగుతుంది అని చెబుతున్నారు.

ఇలా పిల్లి ఎదురు వస్తే వెనక్కు వచ్చి కాళ్లు కడుక్కొని కాసేపు కూర్చొని ఇష్ట దైవాన్ని తలుచుకుని బయటకు వెళ్లాలని శకున శాస్త్రం( Omen )లో ఉంది.ఇంకా చెప్పాలంటే మనం ఇంట్లో పెంచుకునే పిల్లలకు ఈ శకునాలు వర్తించవు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube