పవన్ ప్రశ్నించాడు సరే ! పరిష్కారాలు చుపాడా..?

ప్రశ్నించడం పరిష్కారం వెతకడం అనే సిద్ధాంతంతో అనేక సమస్యల మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించి పరిష్కారం వెతికేశా అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గొప్పలు చెప్పుకుంటున్నాడు.అయితే ఆ గొప్పలు తాత్కలికంగానే పనిచేస్తున్నాయి తప్ప ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడడంలేదు.

 Pawan Kalyan Janasena Asking Questions Only-TeluguStop.com

పవన్‌కళ్యాణ్‌ కొంతకాలంగా ఉత్తరాంధ్ర మీద ద్రుష్టి పెట్టారు.ఎన్నికలే లక్ష్యంగా ఉత్తరాంధ్ర నుంచి పోరాట యాత్రను ప్రారంభించారు.కొన్నాళ్ళపాటు ‘షో’ నడిచింది.‘రంజాన్‌’ పేరుతో కొన్నాళ్ళు ఆ ‘షో’కి విరామం ప్రకటించారు పవన్‌కళ్యాణ్‌.ఇప్పుడేమో, ఉత్తరాంధ్ర మేధావులతో సమావేశమంటున్నారు.ఆ మేధావుల నుంచి ఉత్తరాంధ్ర సమస్యల గురించి తెలుసుకుంటున్నానంటున్నారు.

ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఉద్దానం ప్రాంతం రెండు మూడు దశాబ్దాలుగా కిడ్నీ వ్యాధులతో సతమతం అవుతోంది.కిడ్నీ వ్యాధి బాధితులకు అండగా వుంటానంటూ అప్పట్లో పవన్‌ చేసిన ప్రకటన సంచలనమే అయ్యింది.ఓ విదేశీ యూనివర్సిటీకి చెందిన వైద్య బృందాన్ని పవన్‌, ఉద్దానంకు రప్పించారు.అప్పట్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా దీనిపై స్పందించినట్టే కనిపించింది.ఇది జనసేన ఖాతాలో కూడా వేసేసుకున్నారు.చివరకి చూస్తే ఫలితం మాత్రం సున్నా.

ఉద్దానం వ్యవహారం షరా మాములే అయ్యింది.తామెక్కడో చేసేస్తారని ఆశించించిన అక్కడి బాధితులకు వేదనే మిగిలింది.ప్రభుత్వం కూడా ఆ తరువాత పట్టించుకోవడమే మానేసింది.మళ్ళీ పవన్‌కళ్యాణ్‌ ఉద్దానం ప్రాంతంలో షో చేశారు.

మళ్ళీ మళ్ళీ ‘షో’ చేస్తూనే వుంటారు.ప్రభుత్వానికి ఉద్దానంపై పవన్‌ పెట్టిన డెడ్‌లైన్‌ ఏమయ్యిందో, ఆ తర్వాత ఆ సమస్యపై పవన్‌ పోరాటం ఏమయ్యిందో ఎవరికీ తెలియదు.

ఉత్తరాంధ్ర సంస్కృతీ సంప్రదాయాలపై పవన్‌ మక్కువ పెంచుకున్నారన్నది ఆయన గురించి చాలామంది చెప్పే మాట.ఇటీవల పవన్‌ విజయవాడలో అద్దె ఇల్లు తీసుకున్నారు.ఉత్తరాంధ్ర మీద అంత మమకారం వున్న పవన్‌కళ్యాణ్‌, అద్దె ఇల్లు ఎలాగూ తీసుకోవాలి గనుక.అదేదో విశాఖలో తీసుకుని వుంటే బావుండేది కదా.అన్న ప్రశ్న ఆయన అభిమానులనుంచే వస్తోంది.కేవలయం ఆయన రాజకీయంగా బలపడడానికి తప్ప నిజంగా ఆయనకు చిత్తశుద్ధి లేదని.

ఆయన ఎప్పుడు ఎలా వ్యవహరిస్తాడో కూడా తెలియదని అటువంటి వ్యక్తి తమకేదో చేసేస్తాడని అక్కడి ప్రజలు నమ్మకం పెట్టుకోవడం వారి మూర్ఖత్వమే అవుతుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube