పవన్ పాలిటిక్స్ పార్ట్ టైం కాదా ..? ఫుల్ టైమా..?

2014 ఎన్నికల్లో రాజకీయ సునామి సృష్టించే దమ్ము ఉన్నా.అప్పుడు సరైన సమయం కాదని ఊరుకున్నాడని… .

 Pawan Shock To Parties Politics-TeluguStop.com

సీజనల్ నాయకుడని ఒకరు.పార్ట్‌టైమ్ లీడర్ అని మరొకరు… ఇలా అనేకమంది అనేక రకాలుగా కామెంట్లు చేసినా.

అవేమి పట్టించుకోకుండా పవన్ ముందుకు వెళ్తున్నారని పవన్ అభిమానులు చెబుతున్నారు.రాష్ట్రంలో ఉన్న సమస్యలు చూసి చలించే ఇప్పుడు యాత్ర ప్రారంభించారని జనసేన వర్గాలు చెప్తున్నాయి.

ఇంతకీ పవన్ కి ఇప్పుడే రాష్ట్ర సమస్యలు గుర్తొచ్చాయా .? లేదా ఎన్నికల సమయం దగ్గరకు వచ్చింది కదా అని నిద్ర లేచాడా .?

సాధారణ ఎన్నికలకు సంవత్సరమే సమయం ఉంది .ఇంకా చెప్పాలంటే పదకొండు నెలలు మాత్రమే గడువు ఉంది.నాలుగేళ్లుగా లేని ఉత్సాహాన్ని ఈ పదకొండు నెలల కాలంలోనే రెట్టిస్తానంటున్నాడు జనసేనాని.పవన్‌కల్యాణ్‌ దగ్గరున్న పర్‌ఫెక్ట్‌ స్ట్రాటజీ ఏంటి? రాజకీయ చదరంగంలో ప్రజారాజ్యంతో నేర్చుకున్న గుణపాఠాన్ని… జనసేనాధిపతిగా ప్రత్యర్థులకు ఇచ్చే ఝలక్‌ ఏంటి? మొత్తంగా పవన్‌ ఆలోచనేంటి? రాజకీయ ఎత్తుగడలేంటి ? అనేది ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది.
పార్ట్‌టైమ్‌ లీడరన్న ఆపవాదును పోగొట్టుకుని ఉత్తరాంధ్ర నుంచి నూతన ఉత్సాహంతో రాజకీయ కదనరంగంలో అడుగుపెడుతానని ప్రకటించాడు.ప్రత్యర్థుల గాలి మాటలకు ఇక దిమ్మతిరిగే కౌంటర్‌ ఇస్తానంటున్నాడు పవన్‌కల్యాణ్‌.224 స్థానాలున్న కర్నాటక అసెంబ్లీలో 38 అంటే 38 సీట్లు మాత్రమే సాధించిన జేడీఎస్ సీఎం పదవిని దక్కించుకునే అవకాశాన్ని కొట్టేసింది.అది రావడం రాకపోవడం సంగతి పక్కనపెడితే… కనీసం అంత వరకైనా వెళ్లి.

రాజకీయంగా అలజడి సృష్టించిందన్న సంగతి జనసేనలో కొత్త ఆశలకు కేంద్రమైంది

టీడీపీ , వైసీపీపై ఉన్న వ్యతిరేకతను ఉపయోగించుకుని ఏపీ రాజకీయాల్లో ఒక బలమైన శక్తిగా ఎందుకు ఎదగకూడదన్న ఆలోచన పవన్‌లో బలంగా ఏర్పడిపోయింది.అందుకే రాబోయే ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకునే అంత స్థాయి రాకపోయినా కనీసం జేడీఎస్ స్థాయిలో ఏపీలో చక్రం తిప్పాలని పవన్ ఆరాటపడిపోతున్నాడు.

పవన్ లో ఆరాటం అయితే ఉంది కానీ దాన్నిప్రజల్లో కి తీసుకెళ్లి ఓట్లుగా మలుచుకునే అంత సీన్ ఉందా అనే సందేహం వ్యక్తం అవుతోంది.జనసేనలో నాయకుడు ఉన్నాడు తప్ప నాయకత్వమే లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube