పవన్ పరువు తీసిన కిడ్నీ డాక్టర్ ! అసలు నిజాలు ఇవేనా ..? .

ఉద్దానం కిడ్నీ సమస్యల మీద పవన్ పప్పులో కాలు వేశాడా.? అసలు దానిమీద కనీస అవగాహన లేకుండా పవన్ ఆ ఇష్యు ఎత్తుకుని రాజకీయ లబ్ధిపొందాలి అనుకుంటున్నాడా.? కిడ్నీ బాధితులను పవన్ మోసం చేస్తున్నాడా .? అంటే మోసం చేస్తున్నాడనే చెప్పాలి.పవన్ ఈ విషయంలో ఉన్న సీరియస్ నెస్ తెలియకుండా ,కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కిడ్నీ వైద్య నిపుణుడు అయిన డాక్టర్ విజయకుమార్ అనే వ్యక్తి సోషల్ మీడియా లో రాసిన పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది.

 Pawan Gets Big Shock-TeluguStop.com

నేను ఒక కిడ్నీ వ్యాధి నిపుణుడిని నాకు ఈ రంగంలో 23 యేళ్ల అనుభవం ఉంది.

కానీ నాకు అర్ధం కాని విషయం ఏంటంటే నన్ను గెలిపించితే లేదా నా దగ్గర ఐదుగురు లేదా ఆరుగురు ఎమ్మెలేలు ఉంటే నేను ఈ సమస్యని వెంటనే పవర్ లోకి రాగానే పరిష్కరిస్తాను అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పడం.

ఈ క్రానిక్ రెనల్ ఫెయిల్యూర్ అనేది ఒక భయంకరమైన వ్యాధి! ప్రపంచం మొత్తం ప్రతీ సంవత్సరం 35 మిలియన్ మందిని చంపుతున్న జబ్బు, ఇది ఒక్క ఉద్దానం లోనే కాదు ఇంకా చాల చోట్ల ఉంది.వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనే ఒక ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంస్థ! ఈ ఉద్దానం కిడ్నీ జబ్బు అనేది ఒక’ కారణం తెలియని జబ్బుగా’ తేల్చి చెప్పింది,అది కూడా ఊరికే కాదు! ఎన్నో పరిశోధనలు ఎంతో ప్రఖ్యాతి గాంచిన ఐసీఎమార్, బాబా రీసర్చ్ సెంటర్, హార్వార్డ్ విశ్వవిద్యాలయం లాంటివి పరిశోధనలు చేసిన తరువాత ఏ విషయాన్నీ ధ్రువీకరించారు.

ఈ ఉద్దానం లాంటి స్థలాలు, వీటిని టెక్నిక భాషలో ‘పాకెట్లు’ అంటారు, ఇవి ప్రపంచం మొత్తం లో అమెరికాలో బ్రెజిల్లో శ్రీలంకలో కూడా ఉన్నాయి.

అక్కడ కూడా ఈ జబ్బు రావడానికి గల ఎలాంటి కారణము ఇపటి వరుకూ కనిపెట్టలేక పోయారు.ఉద్దానం ఒక్క చోటే కాకుండా ఆంధ్రా మరియూ తెలంగాణాలో ఇంకా ఎన్నో గూడాలూ, తండాలలో ఈ జబ్బు బాగ ప్రబలిన ప్రాంతాలు ఉన్నాయి.

ఇక్కడున్న ప్రజలు ఇక్కడినించి వేరే చోటకి వెళ్లటానికి ఇష్టపడక పోవడమే దీనికి కారణంగా కనిపిస్తోంది.

‘క్రానిక్ రీనల్ ఫైల్యూర్’ అనేది ఒక కాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధి రోగిని పీల్చి పిప్పి చేస్తుంది.

కానీ దీని గురించి జనాలకి బాగానే తెలుసు, దీన్ని తగ్గించడానికి రక రకాల ట్రీట్మెంట్లు ఉన్నాయి, మందులు, ‘హీమోడయాలిసిస్, పెరిటోనియల్ డయాలిసిసి, కిడ్నీ మార్చడం’ లాంటివి.ఆది ఉద్దానం కావొచ్చు ప్రపంచంలో ఇంకెక్కడైనా కావొచ్చు కానీ ట్రీట్మెంటు మాత్రం ఇదే.ఈ జబ్బు కూడా కాన్సర్ లాగా ప్రతీ సంవత్సరం చాలా మంది ప్రాణాలు తీసే మహమ్మారి.

ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం మీద శ్రద్ధ వహించి ఇప్పటికే ఈ కిడ్నీ పాడైన పేషెంట్లందరికీ ఎన్టీఆర్ వైద్య సేవ పధకం కింద ఉచితంగా వైద్యం చెయ్యడమూ, నెలకి 2500 రూపాయల పెన్షన్ ఇస్తూ వారిని ఆదుకుంటోంది .దయచేసి ఈ విషయాన్ని రాజకీయం చేసి ఈ జబ్బు బారిన పడినవారిని ఇంకా బాధపెట్టొద్దు .

ఈ క్రానిక్ రెనల్ ఫెయిల్యూర్ కన్నా ఇంకా భయంకరమైన జబ్బు ఒకటి ఉంది దాని పేరు ‘ఫ్లోరసిస్’,అది ఫ్లొరిన్ ఎక్కువున్న తాగు నీటి వల్ల వస్తుంది, ఈ జబ్బు తెలంగాణాలో ఎక్కువగా ఉంది, ఫ్లొరిన్ తక్కువున్న నీళ్ళు సరఫరా చేస్తే ఈ జబ్బు తగ్గించొచ్చు.మన పవన్ కళ్యాణ్ గారు తెలంగాణాలో ఈ విషయం గురించి పొరాటం చేస్తే బాగుంటుంది.

దేశం మొత్తం లో కానీ, మిగతా రాష్ట్రం మొత్తం మీద కానీ మనము కానీ లెక్కలు పోల్చి చూస్తే ఆంధ్రాలో పది యేళ్లల్లో 2500 మంది ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక పెద్ద సంఖ్య కానే కాదు ఎందుకంటే ఈ సంఖ్య దేశం మొత్తం లో చూస్తే లక్షల్లో ఉంటుంది.

కంట్రొల్ లో లేని షుగర్ లెవెల్స్, అంటే డయబీటిస్, నొప్పులు తగ్గించే మాత్రలని, పెయిన్ కిల్లర్స్, అతిగా వాడడం ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీస్కోవడం లాంటివి ఈ జబ్బు రావడానికి కొన్ని ముఖ్య కారణాలు.అలానే ఈ జబ్బు ఇలానే ట్రీట్ చెయ్యాలీ అనే రకమైన విధానం అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు, ఇది ప్రతీ పేషెంటుకీ మారుతూ ఉంటుంది.

నేను ఈ జబ్బుకి శాశ్వత పరిష్కారం చూపిస్తాను అని ఎవరన్నా చెప్పడం, అది కూడా అసలు వైద్య రంగానికి సంబంధం లేని వ్యక్తి చెప్పడం అనేది ఒక రకమైన ఫూలిష్ నెస్ తప్ప ఇంకొకటి కాదు.

ఒకవేళ ఒక కొత్త రీసర్చ్ లేదా పరిశోధన మొదలయ్యిందనుకుందాం , కానీ అది కూడా మొదటి ఫలితాలను ప్రకటించడానికి కూడా కొన్ని సంవత్సరాలు తీస్కుంటుంది.

ఈ జబ్బు అనేది 2001 నించీ బాగా తెల్సిన జబ్బే అంతే కాకుండా ఈ వుద్దానం కిడ్నీ ఫెయిల్యూర్ మీద చాలా పేపర్లు ప్రచురించారు! చాలా మంది ఈ విషయం మీద పరిశోధనలు చేసే వాళ్లని సంప్రదించడం కూడా జరిగింది.కానీ అసలు ఈ జబ్బు రావడానికి ఒక ప్రత్యేక కారణం అంటూ ఏముందో ఎవరూ కనిపెట్టలేక పోయారు.

అంటూ విజయకుమార్ పోస్టింగ్ ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube