దారుణం : రెండు చోట్ల కూడా పవన్‌ ఓటమి

రాజకీయాల్లో మార్పు తీసుకు వస్తానంటూ జనసేన పార్టీని ప్రారంభించిన పవన్‌ కళ్యాణ్‌ను ఏపీ ప్రజలు పట్టించుకోలేదు.గత ఎన్నికల్లో అంటే 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా చంద్రబాబు నాయుడు మరియు మోడీకి మద్దతుగా పవన్‌ నిలిచాడు.

 Pawan Kalyan Loste Both Seats-TeluguStop.com

అయితే ఈసారి మాత్రం పవన్‌ కళ్యాణ్‌ సొంతంగానే బరిలోకి దిగాడు.మ్యాజిక్‌ ఫిగర్‌ రాకున్నా కూడా కనీసం కింగ్‌ మేకర్‌గా అయినా పవన్‌ నిలుస్తాడని అంతా భావించారు.

పవన్‌కున్న ఛరిష్మాతో దుమ్ము లేచిపోవడం ఖాయం అంటూ అంతా విశ్లేషించారు.కాని పవన్‌ కళ్యాణ్‌ కనీసం ఒక్క స్థానం అంటే ఒక్క స్థానం కూడా దక్కించుకోలేక పోయాడు.

కొత్త రాజకీయాలను ప్రజలకు రుచి చూపిస్తామంటూ చెప్పుకొచ్చిన జనసేనానికి ప్రజలు అనూహ్యంగా షాక్‌ ఇచ్చారు.జనసేన నుండి ఎవరు గెలిచినా గెలవక పోయినా కూడా పవన్‌ మాత్రం పోటీ చేసిన రెండు స్థానాల నుండి గెలుస్తాడని అంతా భావించారు.

కాని అనూహ్యంగా పవన్‌ పోటీ చేసిన గాజువాక మరియు భీమవరం స్థానాల్లో కూడా ఓడిపోయాడు.గాజువాకలో వైకాపా అభ్యర్థి నాగిరెడ్డి విజయాన్ని సొంతం చేసుకోగా, భీమవరంలోనూ వైకాపా అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్‌ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

మార్పు కోసం అంటూ సినిమాలను వదిలి పెట్టి వచ్చిన స్టార్‌ హీరోను ఇలా దారుణంగా ఓడించడంపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గాజువాక మరియు భీమవరం ప్రజలకు కనీస గౌరవం, ఆలోచన కూడా లేకుండా పోయిందని, డబ్బులు ఎవరు ఇస్తే వారకే ఓట్లు వేయడం పద్దతి రాజకీయంగా, ప్రజాస్వామ్యంగా మంచిది కాదంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇలాంటి ఫలితాలను ఊహించని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఏమంటారో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube