న్యూయార్క్ లో భారతీయత చాటిన “సిక్కు మహిళ”

భారతీయ మహిళ న్యూయార్క్ పోలీసు విభాగంలో చరిత్ర సృష్టించింది.సిక్కు వర్గానికి చెందిన మహిళా మొదటి సారిగా న్యూయార్క్ పోలీసు విభాగంలో చేరనుంది.

 Gurusoch Kaur Appointed As New York Polices First Sikh Turban Woman-TeluguStop.com

ఆమె పేరు గురుశోచ్‌ కౌర్‌ అయితే ఈ ఘనత సాధించిన తొలి సిక్కు మహిళగా గురుశోచ్‌ కౌర్‌ రికార్డు క్రియేట్ చేసింది.అమెరికాకు వలసవెళ్ళిన వారిలో అత్యధికులు భారతీయులు కాగా భారతీయులలో అత్యధికులు సిక్కులు అమెరికాలో అధిక సంఖ్యలో ఉండటం గమనార్హం.


ఇదిలాఉంటే తలపాగా చుట్టుకుని మరీ న్యూయార్క్ పోలీసు విభాగంలో విధులు నిర్వరించనుంది న్యూయార్క్‌ సిటీ పోలీస్‌ అకాడమీలో గతవారం డిగ్రీ పూర్తి చేసుకున్న ఆమె పోలీసు సహాయక అధికారిణిగా న్యూయార్క్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో చేరనున్నారు.‘‘గురుశోచ్‌ కౌర్‌ను న్యూయార్క్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లోకి ఆహ్వానించటం తమకి ఎంతో గర్వంగా ఉందని ఆమె ఎంతో ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని సిక్క్‌ ఆఫీసర్స్‌ అసోషియేషన్‌ ట్విటర్‌ లో పేర్కొంది.


అయితే అమెరికా ప్రజలు సిక్కులని అర్థం చేసుకునే విధంగా “గురుశోచ్‌ కౌర్‌” తన విధులని నిర్వర్తించాలని “మినిష్టర్‌ ఆఫ్‌ హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ అఫైర్స్‌” హరదీప్‌ సింగ్‌ పూరి కోరారు…ఎందుకంటే గతంలో అంటే 2010లో ఆయనకీ జరిగిన అవమానం ఈ మధ్యకాలంలో కెనడా మంత్రి నవదీప్‌ తెలియచేశారు.సిక్కులు ఎంతో శాంత స్వభావులని ఎవరు ఎటువంటి ఆపదలో ఉన్నా సరే సిక్కులు తమవంతు సాయం చేస్తారని కొనియాడారు హరదీప్… గురుశోచ్‌ కౌర్‌ కి శుభాకాంక్షలు తెలిపారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube