నేటినుంచే జియో ఫోన్ బుకింగ్ ... ఎలా చేసుకోవాలో చూడండి

జియో 4G ఫోన్ ప్రీ బుకింగ్స్ ఈరోజుతో మొదలు.సాయంత్రం 5:30 నిమిషాల నుంచి మీరు బుకింగ్ చేసుకోవచ్చు.LTE + VoLTE నెట్వర్క్ తో, పూర్తిస్థాయి 4G ఫీచర్ ఫోన్ గా వస్తున్న జియో 22 భారతీయ భాషలను సపోర్ట్.ఈ మొబైల్ ని మీరు టీవికి కనెక్ట్ చేసి, జియో టీవి యాప్ ద్వారా 500+ ఛానెల్స్ చూడవచ్చు.NFC సపోర్ట్ కూడా ఉంటుంది
స్పెసిఫీకేషన్స్ ఇలా ఉన్నాయి

 Jio 4g Phone Booking Starts Today Here Is How You Can Book One 1-TeluguStop.com

Display : 2.4 inches
RAM – 512 MB
Internal Storage – 4GB
Expandable storage – Yes microSD card slot
Processor – Qualcomm and Spreadtrum chipsets
Back Camera – 2 megapixels
Front Camera – VGA
4G – Yes (voLTE)
Wi-Fi – Yes
NFC – Yes
GPS – Yes

ఇక ఈ ఫోన్ బుక్ చేసుకోవాలంటే, బుకింగ్ టైం లో 500 ఇస్తే సరిపోతుంది.ఫోన్ మీ దగ్గరకి వచ్చేటప్పుడు మరో 1000 కట్టాలి.ఫోన్ మీదాక రావడానికి ఓ నెల సమయం పట్టొచ్చు.

ఆన్ లైన్ లో బుక్ చేయాలంటే :

* jio.com లోకి వెళ్ళండి
* మీ మొబైల్ నంబర్ తో పాటు పిన్ కోడ్ ఎంటర్ చేయండి.(ప్రీ బుకింగ్ కి ఆధార్ వివరాలు అవసరం లేదు)
* పేమెంట్ కి ప్రొసీడ్ అవ్వండి, డబ్బు కట్టి ఫోన్ బుక్ చేయండి
* పని అయిపొయింది.ఫోన్ బుక్ అయినట్లుగా మీ మొబైల్ కి మెసేజ్ వస్తుంది

స్టోర్స్ లో తీసుకోవాలంటే :


* దగ్గరిలోకి రిలయన్స్ డిజిటల్, జియో స్టోర్స్ కి వెళ్ళండి
* ఆఫ్ లైన్ బుకింగ్ కాబట్టి బ్యాకప్ కోసం ఆధార్ తీసుకెళ్ళండి
* రిటైలర్ కి రూ.500 చెల్లించి మీ వివరాలు తెలుపండి
* వెంటనే మీ మొబైల్ కి ఫోన్ బుక్ అయినట్లుగా మెసేజ్ వస్తుంది
* రేటైలర్ రిసిప్ట్ ఇస్తాడు, మరచిపోకుండా తీసుకోండి

జియో యాప్ నుంచి బుక్ చేయాలంటే :

* మై జియో యాప్ ఓపెన్ చేసి మీ ఐడితో లాగిన్ అవ్వండి
* అక్కడే జియో మొబైల్ బుకింగ్ ఆప్షన్ కనిపిస్తుంది క్లిక్ చేయండి
* మీ ఫోన్ నంబర్, పిన్ కోడ్, ఇతర వివరాలు తెలుపండి (ఆధార్ అప్పుడే అవసరం లేదు)
* పేమెంట్ కి ప్రొసీడ్ అవ్వండి, డబ్బు కట్టి బుక్ చేయండి
* బుకింగ్ కన్ఫర్మేషన్ తో మీ మొబైల్ తో మెసేజ్ వస్తుంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube