“నాటా” సాహిత్య పోటీలకి “ఎన్నారై” లకి ఆహ్వానం

ఉత్తర అమెరికా తెలుగు సమితి (“నాటా”) ప్రతీ ఏటా తెలుగు సంస్కృతీ ,సాంప్రదాయాలు మరియు కవితలు ఇలా ఎదో ఒక విధంగా తెలుగుదనాన్ని చాటి చెప్పే కార్యక్రమాన్ని ఎదో ఒక సందర్భాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేస్తూనే ఉంటుంది.అయితే అందులో భాగంగానే ఈ సారి నాటా 2018 సాహిత్య పోటీలకు రచయితలు, కవులకు ఆహ్వానం పలికింది.

 Nata Mega Convention Philadelphia-TeluguStop.com

అయితే నాటా ఈ సారి సారంగా వెబ్ అనే సాహిత్య పక్ష పత్రిక సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

అయితే వీటిలో గెలుపొందిన విజేతలని జూలై 6 నుంచి 8 వరకు ఫిలడెల్ఫియాలో జరగనున్న నాటా సభల్లో కథలు, కవిత్వ పోటీల ఫలితాలు వెలువరించనున్నారు.ఈ కథల పోటీల్లో మొదటి బహుమతికి రూ.15 వేలు, రెండో బహుమతికి రూ.10 వేలు, మూడో బహుమతికి రూ.5 వేలు ఇవ్వనున్నారు…అయితే గతంలో కూడా ఎటువంటి పోటీలకి తెలుగు వారి నుంచీ విశేష స్పందన లభించింది.

అయితే “కవితల” పోటీల్లో మొదటి బహుమతికి రూ.5 వేలు, రెండో బహుమతికి రూ.3 వేలు, మూడో బహుమతికి వెయ్యి రూపాయలుగా ప్రకటించారు.జూన్‌ 1లోపు కవితలు, కథలు పంపించాలని నాటా ఓ ప్రకటనలో తెలిపింది.

పోటీల్లో గెలుపొందిన కథలు, కవిత్వాలను సారంగ (magazine.saarangabooks.com)లో ప్రచురిస్తారు.అదేవిధంగా రచనలు Literaty@nata2018.org పంపించాలని సాహిత్య కమిటీ ఛైర్‌ జయదేవ్‌ మెట్టుపల్లి విజ్ఞప్తి చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube