నంద్యాల బైపోల్స్‌లో దిమ్మ‌తిరిగే ట్విస్ట్‌

నంద్యాల ఉప ఎన్నిక‌ల ఫ‌లితం కోసం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఎన్నిక ప్ర‌శాంతంగా జ‌ర‌గ‌డం, భారీ పోలింగ్ న‌మోద‌వ‌డం త‌మ విజ‌యానికి క‌లిసొస్తుందని టీడీపీ భావిస్తోంది.

 Twist In Nandyal By Poll-TeluguStop.com

ముఖ్యంగా టీడీపీ అభ్య‌ర్థి త‌ర‌ఫున ప్ర‌చార బాధ్య‌తంతా సీఎం చంద్ర‌బాబు మోశారు.రెండుసార్లు నంద్యాల‌లో ప్ర‌చారం చేశారు.

ఇక సినీన‌టుడు బాల‌కృష్ణ ప్ర‌చారం కూడా టీడీపీలో జోష్ నింపింది.వీరిద్ద‌రి వ‌ల్ల ఇప్పుడు నంద్యాల టీడీపీ అభ్య‌ర్థి బ్ర‌హ్మానంద రెడ్డి.

చిక్కుల్లో ప‌డ‌బోతున్నారు.ఎన్నికల నోటిఫికేష‌న్ మొద‌లైన నాటి నుంచి ప్ర‌తి అంశాన్ని.

ఈసీ క్షుణ్ణంగా ప‌రిశీలించి ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటోంది.ఈ నేప‌థ్యంలో ఇప్పుడు `స్టార్ క్యాంపెయిన‌ర్ల` జాబితా రూపంలో పెద్ద చిక్కొచ్చి ప‌డింది

నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో గెలిచి.

వైసీపీని నైతికంగా దెబ్బ‌తీస్తామ‌ని టీడీపీ నేత‌లు గట్టిగా చెబుతున్నారు.ఇక భారీ మెజారిటీ ఖాయ‌మ‌ని కూడా కొంద‌రు స్ప‌ష్టంచేస్తున్నారు.

అయితే ఇప్పుడు ఈసీ నిబంధ‌న‌లు వీరికి గ‌ట్టి షాకిచ్చేలా ఉన్నాయి.నిబంధ‌న‌ల ప్ర‌కారం.

ఎన్నిక‌ల‌ నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఏ పార్టీ అయినా తమ పార్టీ తరపున ప్రచారం నిర్వహించే స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఎన్నికల సంఘానికి అందివ్వాల్సి ఉంటుంది.ఇలా జాబితే ఇస్తే వారి పర్యటనలు.

ప్రచారానికి అయ్యే ఖర్చును అభ్యర్థి ఖాతాలో జమచేయరు.లేదంటే వారి ఖర్చు కూడా అభ్యర్థి ఖాతాలోనే పడుతుంది.

టీడీపీ స్టార్ క్యాంపెయినర్లుగా టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పేరుతో పాటు హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేరు ఇచ్చారు.అది కూడా నోటిఫికేషన్ వెలువడిన రెండు వారాల తర్వాత.

ఇది నిబంధనలకు విరుద్ధం అని.గడువులోగా తమకు స్టార్ క్యాంపెయినర్ల వివరాలు రానందున వీరి పర్యటనలు.ప్రచారానికి అయిన ఖర్చును కూడా అభ్యర్థి ఖర్చులోనే రాయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్ లాల్ కు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) సూచించినట్లు ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘ద ఇండియన్ ఎక్స్ ప్రెస్’ ఢిల్లీ ఎడిషన్ లో ప్రచురించింది.ప్ర‌స్తుత‌ నిబంధనల ప్రకారం ఒక అసెంబ్లీ అభ్యర్థి రూ.28 లక్షలు మాత్రమే ఖర్చు చేయటానికి అనుమతి ఉంది

ఒకవేళ బ్రహ్మానందరెడ్డి ఉప ఎన్నికలో విజయం సాధిస్తే.ఆయన ఖర్చు పరిమితి కంటే ఎక్కువ అయితే దీన్ని ఛాలెంజ్ చేయవచ్చని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు.

అప్పుడు కోర్టు కూడా ఈ గెలుపును పక్క పెట్టాల్సిందిగా ఆదేశించినా ఆశ్చర్యం లేదంటున్నారు.నిబంధనల ప్రకారం గడువులోగా స్టార్ క్యాంపెయినర్ల వివరాలు ఇవ్వనందున వారి ఖర్చును కూడా అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి ఖాతాలోకి వేయాలని ఆదేశించింది.

ఇది టీడీపీకి ఎద‌రుదెబ్బే! ఎందుకంటే ఇప్ప‌టికే ఎల‌క్ష‌న్ ఖ‌ర్చు దాదాపు లక్ష‌లు దాటిపోయింది.మ‌రి వీరి ఖర్చు కూడా అభ్య‌ర్థి ఖాతాలోకి వెళితే.మ‌రింత ఎక్కువ అయ్యే అవ‌కాశం లేక‌పోలేదు!!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube