దాని వల్ల తెగ ఫీల్‌ అవుతున్న నాగచైతన్య

టాలీవుడ్‌లో కొన్ని సార్లు కొన్ని చిత్రాలు ఒక హీరో చేయాల్సింది మరో హీరో చేస్తూ ఉంటాడు.ఆ సినిమాలు సక్సెస్‌ అవ్వొచ్చు, అవ్వక పోవచ్చు.

 Nagachaitanya Missed Golden Chance-TeluguStop.com

పవన్‌ కళ్యాణ్‌ వద్దకు వెళ్లిన రెండు మూడు సినిమాలు రవితేజ చేశాడు.రవితేజ ఆ చిత్రాలతో సక్సెస్‌లను దక్కించుకున్నాడు.

ఇంకా పలువురు హీరోలు కూడా ఇతర హీరోల సినిమాలను పొరపాటున చేసి, సక్సెస్‌లు దక్కించుకున్నారు.తాజాగా నాగచైతన్య చేయాల్సిన చిత్రాన్ని సుధీర్‌బాబు చేసి సక్సెస్‌ దక్కించుకున్నాడు.

సుధీర్‌బాబు చాలా సంవత్సరాల తర్వాత సక్సెస్‌ను ‘సమ్మోహనం’ చిత్రంతో దక్కించుకున్న విషయం తెల్సిందే.

‘సమ్మోహనం’ చిత్రంను మొదట దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి, నాగచైతన్యతో చేయాలని భావించాడు.రెండు మూడు సార్లు కథను చైతన్యకు చెప్పడంతో పాటు కథను చైతూకు అనుకూలంగా మార్చడం కూడా జరిగింది.అయినా కూడా అంతకు ముందే ఒప్పుకున్న సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ చిత్రాన్ని చేసేందుకు ముందుకు రాలేదు.

నాగచైతన్య ‘సమ్మోహనం’ చిత్రం చేసి ఉంటే ఫలితం మరింత పాజిటివ్‌గా ఉండేది అంటూ ప్రస్తుతం సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.భారీ అంచనాల నడుమ రూపొందిన ‘సమ్మోహనం’ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మరియు ఓవర్సీస్‌లో మంచి వసూళ్లను రాబడుతున్న నేపథ్యంలో నాగచైతన్య ఫీల్‌ అవుతున్నట్లుగా సమాచారం అందుతుంది.

అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన కొందరి వద్ద నాగచైతన్య ‘సమ్మోహనం’ సినిమా గురించి చర్చించినట్లుగా తెలుస్తోంది.సమ్మోహనం చిత్రంను తాను చేస్తే బాగుండేది అని, తప్పకుండా తనకు మంచి సక్సెస్‌ను ఆ చిత్రం ఇచ్చేది అంటూ చైతూ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇలాంటి సినిమాను వదులుకున్నందుకు బాధపడుతున్నట్లుగా ఆయన పేర్కొనట్లుగా తెలుస్తోంది.మొత్తానికి నాగచైతన్య సమ్మోహనం చేయక పోవడం వల్ల ఆయన కెరీర్‌కు నష్టం తప్పదని సినీ వర్గాల వారు కూడా అంటున్నారు.

ప్రస్తుతం నాగచైతన్య ‘సవ్యసాచి’ చిత్రంను చేస్తున్నాడు.త్వరలోనే విడుదల కాబోతున్న సవ్యసాచితో పాటు ‘శైలజ రెడ్డి అల్లుడు’ చిత్రం కూడా చేస్తున్నాడు.ఈ రెండు చిత్రాలు కూడా రెండు మూడు నెలల గ్యాప్‌లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న శైలజ రెడ్డి అల్లుడు చిత్రంలో హీరోయిన్‌గా అను ఎమాన్యూల్‌ నటిస్తుండగా, మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు.

అత్త పాత్రలో రమ్యకృష్ణ కనిపించబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube