దత్తాత్రేయ కొడుకు వైష్ణవ్ గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు ఇవే.! అసలు ఆరోజు రాత్రి ఏమైంది.?

కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.ఆయన కుమారుడు వైష్ణవ్‌(21) హఠాన్మరణం చెందారు.

 Dattatreya Son Vaishnav Death-TeluguStop.com

ఎంబీబీఎస్‌ మూడో ఏడాది చదువుతున్న వైష్ణవ్‌ బుధవారం తెల్లవారు జామున గుండెపోటుతో మృతి చెందారు.వివరాలు.

రాత్రి, 10 గంటలకు భోజన సమయంలో వైష్ణవ్‌ హఠాత్తుగా కుర్చీలో నుంచి కిందకు కుప్పకూలిపోయారు.దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ముషీరాబాద్‌లోని గురునానక్‌ కేర్‌ ఆస్పత్రికి తరలించారు.

వివరాల లోకి వెళ్తే.!

ఎంబీబీఎస్‌ మూడో సంవత్సరం చదువుతున్న 21 ఏళ్ల యువకుడు! స్కూల్లో, కాలేజీలో క్రికెట్‌ ఆడడమే కాదు.ఎప్పుడూ చురుగ్గా, ఉత్సాహంగా ఉంటాడు! మంగళవారం రాత్రి తల్లిదండ్రులతో కలిసి భోజనం చేస్తున్నాడు! ఆ సమయంలో దగ్గు రావడంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు! పొలమారిందని అనుకుని నీళ్లు తాగించారు! సోఫాలో కూర్చోబెట్టి, సపర్యలు చేస్తున్నారు! ఫిట్స్‌ వచ్చి కుర్చీ నుంచి కింద పడిపోయాడు.అంతలోనే, అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు! హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు!

వెంటనే దత్తాత్రేయకు దగ్గర బంధువైన డాక్టర్‌ సత్యం, ఫ్యామిలీ డాక్టర్‌ ఆవుల రామచంద్రరావుతోపాటు మరికొందరు వైద్యులకు సమాచారం అందించారు.

దత్తాత్రేయ ఇంటికి సమీపంలోనే ఉంటున్న ఆయన తోడల్లుడి కూతురు, అల్లుడు(ఇద్దరూ డాక్టర్లే) హుటాహుటిన వచ్చి ప్రాథమిక చికిత్స అందించారు.దాదాపు 15మంది డాక్టర్లు అత్యాధునిక వైద్య చికిత్సలు అందించారు! అయినా, ఫలితం దక్కలేదు!


పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ముషీరాబాద్‌లోని కేర్‌ ఆస్పత్రికి తరలించారు.

అప్పటికే పల్స్‌ రేట్‌, బ్లడ్‌ ప్రెషర్‌ పడిపోయాయని, గుండె స్పందనలు లేవని డాక్టర్లు తెలిపారు.గుండె స్పందనలు లేకపోవడంతో వెంటనే కార్డియో పల్మనరీ రెసూసిటేషన్‌ చికిత్స అందించారు.

గంటకుపైగా ప్రయత్నం చేసినా ఆరోగ్య పరిస్థితిలో మార్పు లేకపోవడంతో మరో ప్రయత్నంగా క్యాథలాబ్‌కు తరలించి పేస్‌మేకర్‌ అమర్చారు.వెంటిలేటర్‌ ఏర్పాటు చేశారు.కేర్‌కు చెందిన 13మంది, దత్తాత్రేయ తోడల్లుడి కుమార్తె, అల్లుడు మొత్తం 15మంది రెండు గంటలపాటు ప్రయత్నం చేసినా వైష్ణవ్‌ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు.కార్డియాక్‌ అరె్‌స్టతో చనిపోయినట్లు అర్ధరాత్రి 12.30గంటలకు డాక్టర్లు ప్రకటించారు.దాంతో, దత్తాత్రేయ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయకు పుత్ర శోకం మిగిల్చి.ఆయన తనయుడు వైష్ణవ్‌ తరలి రాని లోకాలకు మరలిపోయాడు.ఆయన కార్డియాక్‌ అరె్‌స్టతో కన్నుమూశారని డాక్టర్లు ప్రకటించారు

దత్తాత్రేయ కూతురికి ఇటీవలే ఓ డాక్టర్‌తో పెళ్లి చేశారు.వైష్ణవ్‌ మెడిసిటి మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు.వైష్ణవ్‌కు వైద్య చికిత్స అందిస్తున్న సమయంలో పరిస్థితి చేయి జారిపోతోందని గుర్తించిన బంధువులు, డాక్టర్లు అతను కోలుకుంటున్నాడని చెప్పి దత్తాత్రేయను ఇంటికి పంపించేశారు.బుధవారం తెల్లవారుజామున 5.30 గంటలకు ఆస్పత్రికి తీసుకొచ్చి విషయం చెప్పారు.దాంతో, అక్కడికక్కడే దత్తాత్రేయ కుప్పకూలిపోయారు.

కన్నీరు మున్నీరుగా విలపించారు.ఉదయం 7గంటల సమయంలో వైష్ణవ్‌ మృతదేహాన్ని ఇంటికి తరలించారు.

మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత సైదాబాద్‌లోని శ్మశానవాటికలో వైష్ణవ్‌ అంత్యక్రియలు నిర్వహించారు.బంధువులు, స్నేహితులు, దత్తాత్రేయ అభిమానులు, కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్‌, సంతోష్‌ గంగ్వార్‌, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌, తెలుగు రాష్ట్రాల్లోని పలు పార్టీల నాయకులు తరలి వచ్చి వైష్ణవ్‌కు నివాళి అర్పించారు.దత్తాత్రేయను ఓదార్చి సానుభూతి వ్యక్తం చేశారు.వైష్ణవ్‌ మృతికి సీఎం కేసీఆర్‌ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క దత్తాత్రేయను కలిసి సానుభూతి వ్యక్తం చేశారు.

దత్తాత్రేయకు గతంలో గుండె సమస్య వచ్చినప్పుడు నాంపల్లిలోని కేర్‌ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేశారు.అప్పట్లోనే వైష్ణవ్‌ను డాక్టర్‌ చేసి ప్రజలకు వైద్య చికిత్సలు అందించాలని ఆయన భావించారు.

వైష్ణవ్‌ను డాక్టర్‌గా చూడాలనేది ఆయన కోరిక.తన ఆశలన్నీ అతనిపైనే పెట్టుకున్నా

వైష్ణవ్‌కు 15 రోజుల కిందటే కుటుంబ సభ్యులు ఫోర్డ్‌ ఎండీవర్‌ కారు కొనిచ్చారు.దానికి వెరైటీ లైటింగ్‌ను ఏర్పాటు చేయాలని వైష్ణవ్‌ తన స్నేహితుడికి సూచించాడు.కారు అతనికి ఇచ్చాడు.

మంగళవారం రాత్రి వైష్ణవ్‌ భోజనం చేయడానికి ముందే, స్నేహితుడు సంతో్‌షకుమార్‌ ఫోన్‌ చేశాడు.కారుకు కొత్త లైట్ల ఏర్పాటు పూర్తయిందని, బయటకు వెళ్లి చూసి వద్దాం రావాలని సూచించాడు.

భోజనం చేసి వస్తానని వైష్ణవ్‌ చెప్పాడు.కానీ, కారులో తన సరదాను తీర్చుకోకముందే మృతి చెందాడని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube