మన దేశంలో ఏమో తెల్లగా ఉంటేనే మనిషి అందంగా ఉన్నట్టు అంటారు.ఎంత తెల్లగా ఉంటే అంత అందం అన్నట్టుగా ప్రవర్తిస్తారు.
అందుకే అందరికి తెల్లగా ఉండే అమ్మాయిలే పెళ్ళికోసం కావాలి.మనవారికి ఈ తెలుపు పిచ్చి ఎక్కువ ఉంది కాబట్టే కంపెనీలు ఫెయిర్ నెస్ క్రీముల పేరుతొ కోట్ల వ్యాపారం చేస్తున్నారు.
ఇక్కడ ఇలా ఉంటే అమెరికాలో రివర్స్ గా ఉన్నారు మనుషులు.అక్కడ జాతి వివక్ష అనేది ఏళ్లుగా ఉన్నా, నల్లగా ఉన్నవాళ్ళు పెళ్లి చేసుకోవడం, తెల్లగా ఉన్నవారిని నల్లవారు పెళ్లి చేసుకోవడం అనేది చాలా కామన్ విషయం.
అయితే ఈమధ్య అమెరికన్స్ డస్కి స్కిన్ పిచ్చి పట్టుకుంది.అంటే మన భారతీయుల రంగు అనుకోండి.
తెల్లగా ఉన్నవారు కొంచెం ట్యాన్ స్కిన్, డస్కి స్కిన్ సాధించేందుకు తంటాలు పడుతున్నారు.ఇక్కడ ఎలాగైతే తెల్ల చర్మం కోసం తంటాలు పడతారో, అచ్చం అలాగే అన్నమాట.
మీకు నమ్మడానికి కష్టంగా అనిపిస్తే ప్రపంచంలోని అందగత్తెల పోల్ చూడండి, బియాన్స్ మొదటి స్థానం, మన ప్రియాంక చోప్రా రెండోవ స్థానం సంపాదించారు.ఈ ఇద్దరు కూడా తెలుపు రంగు కలవారు కాదుగా.
దీనిపై కాస్మోపాలిటన్ వారు ఓ సర్వే చేసారు అందులో యువతి యువకులు బ్రౌన్/డస్కి స్కిన్ పై అమెరికన్స్ లో పెరుగుతున్న వ్యామోహంపై ఇలా స్పందించారు.
అబ్బాయి 1 :
“క్వాంటికో చూసినప్పటి నుంచి ప్రియాంక చోప్రాకి ఫ్యాన్ అయిపోయాను.ఇండియన్స్ చాలా అదృష్టవంతులు.అటు పూర్తిగా వైట్ గా ఉండరు, ఇటు పూర్తిగా బ్లాక్ గా ఉండరు.మధ్యలో, బ్రౌన్ రంగులో భలేగా ఉంటారు.చాలా అందంగా ఉంటారు.
ప్రియాంకను చూసిన తరువాత మిగితా ఇండియన్ హీరోయిన్స్ గురించి కూడా సెర్చ్ చేసాను.ఇలియానా అనే మరో హీరోయిన్ కూడా చాలా హాట్ గా అనిపించింది”
అమ్మాయి 1 :
“బ్రౌన్ స్కిన్ టోన్ చాలా సెక్సీగా ఉంటుంది.మరీ తెల్లగా ఉంటే క్యూట్ గా ఉంటారేమో కాని హాట్ గా ఉండటం చాలా కష్టం.నేను కొంచెం ట్యాన్ అవడానికి చాలా ప్రయత్నిస్తున్నాను.డేట్ చేయాలి అనుకున్నా, వైట్ అబ్బాయిల కన్నా, బ్లాక్ అండ్ బ్రౌండ్ అబ్బాయిలనే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను.”
అమ్మాయి 2 :
“ఎమ్మా వాట్సన్ ని చూసి చూసి అబ్బాయిలకు బోర్ కొట్టింది అనుకుంటా.బియాన్స్, ప్రియాంకలకు అందగత్తెల పోటిలో అమ్మాయిలు కూడా ఓటు వేసి వారిని టాప్ 2 లో పెట్టారు.తెల్లగా అంటే ప్లేన్ గా ఉంటారు.కాస్త నలుపే సెక్సీగా ఉంటుంది.డార్క్ స్కిన్ అబ్బాయిలు చాలా ఆకర్షణీయంగా అనిపిస్తారు నాక్కూడా.
బ్రౌన్ రంగుపై ఈ మక్కువ సడెన్ గా ఏమి రాలేదు”
అబ్బాయి 2 :
“మీరు ఇండియన్ అమ్మాయిలను చూడండి, చాలా క్యూట్ గా ఉంటూనే హాట్ గా కూడా ఉంటారు.అక్కడి వారు ఫెయిర్ నెస్ క్రీమ్స్ వాడతారని విన్నాను.
ఇక్కడేమో ట్యాన్ స్కిన్ కోసం కష్టపడుతున్నారు.దీన్ని బట్టి మనిషి అందాన్ని మనం చూసే పధ్ధతి వేరుగా ఉంటుందని అర్థం అవుతోంది.