తెరపైకి హార్దిక్ పటేల్..గుజరాత్ సీఎం పీటం పై షాకింగ్ కామెంట్స్

మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లోనే మోడీ కి పట్టపగలు చుక్కలు చూపించిన వ్యక్తి గుర్తు ఉండే ఉంటుంది.ఎలా మర్చిపోతాం చెప్పండి.అతనెవరో కాదు హార్దిక్ పటేల్.పాటీదార్ ఉద్యమ నేత అయిన హార్దిక్ పటేల్ ఎన్నో సంచలనాలకి కేంద్రం బిందువు అయ్యాడు.ఒక రకంగా చెప్పాలంటే మోడీ కి గుజరాత్ లో వెన్నులో వణుకు పుట్టించాడు.దేశంలో నే గుజరాత్ ని బెస్ట్ స్టేట్ గా నిలబెట్టిన మోడీ.

 Hardik Patel Sensational Comments Gujarat Cm Post-TeluguStop.com

అంచెలంచెలుగా గా ఎదుగుతూ ఆరెస్సెస్ దృష్టిలో పడ్డారు.

అయితే మోడీ హవా రోజు రోజు కి విశ్వవ్యాప్తం అవ్వడం ఆరెస్సెస్ కి మోడీ ఒక బలమైన నేతగా అనిపించడంతో ఆ సమయంలోనే ప్రధానిగా అక్కడి నుంచీ అడుగులు వేశారు.గుజరాత్ ని తన కనుసన్నలతో మోడీ శాసిస్తున్న సమయంలో.ఒక్క సారిగా హార్దిక్ చేపట్టిన ఉద్యమం మోడీ పై తీవ్రమైన ప్రభావం చూపించింది .పాటీదార్ ఉద్యమాన్ని మొదలు పెట్టిన హార్దిక్.ఎంతో ఎత్తుకు ఎదిగిన మోడీ తన గురించి ఆలోచించేలా వ్యూహాలు పన్నాడు.

ఒకానొక దశలో గుజరాత్ ఎన్నికల సమయంలో యావత్ బీజేపి పెద్దలు అందరూ గుజరాత్ ఎన్నికల్లో పాల్గొన్నారు అంటే హార్దిక్ ఎఫెక్ట్ ఏ రేంజ్ లో ఉందొ అర్థం చేసుకోవచ్చు.

అయితే గుజరాత్ ఎన్నికలలో బీజేపి గెలిచినా హార్దిక ఎఫెక్ట్ మాత్రం మోడీ గ్రాఫ్ ని గుజరాత్ లో చాలా దారుణంగా పడిపోయేలా చేసింది.

అయితే ఆ తరువాత హార్దిక పేరు పెద్దగా వినిపించలేదు అయితే ఈ క్రమంలో దాదాపు గ్యాప్ తరువాత మళ్ళీ హార్దిక్ తెరపైకి వచ్చాడు.రావడమే కాదు మళ్ళీ మోడీ కి గుండెలు జారిపోయే ప్రకటన చేశాడు.

అదేంటంటే.గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ రాజీనామా చేసినట్టు వెల్లడించారు.

గతంలో ఆనంది బెన్ పటేల్‌ను రాజీనామా చేయమని కోరినట్టే గుజరాత్ సీఎం విజయ్ రూపానీని గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో రాజీనామా చేయాలని కోరినట్టు ఆయన వెల్లడించారు.

రూపాని ఇప్పుడు రాజీనామా చేశారని.

ఈ విషయం తాను నిశ్చయంగా చెప్పగలనని అన్నారు.మరో పది రోజుల్లో విజయ్ రూపానీ రాజీనామాను ఆమోదించే అవకాశాలు ఉన్నాయని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

క్షత్రియ, పాటిదార్ వర్గాల నుంచి ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయని కూడా ఆయన తెలిపారు.ప్రభుత్వాన్ని నడపడంలో పూర్తిగా విఫలమైనందునే రూపానీని రాజీనామా చేయాలని మంత్రివర్గం కోరిందని…ఈ కారణంగానే రూపాని రాజీనామా జరిగిందని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube