తవ్వకాలలో బయటపడిన ప్రపంచంలోనే అతి పురాతనమైన బీర్ ఫ్యాక్టరీ.. ఎక్కడంటే..!

ఈజిప్టు, అమెరికా దేశాలకు చెందిన పురావస్తుశాఖ శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో భాగంగా ఈజిప్టు రాజధాని కైరోకు 450 కిలోమీటర్ల దూరంలో గ‌ల‌ ఎబిడాస్ నగరంలో ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన బీర్ ఫ్యాక్టరీని కనుగొన్నారు.ఈ పురాతన బీర్ ఫ్యాక్టరీ నైలు నదికి పశ్చిమంగా ఉన్న ఓ శ్మశాన వాటికలో కనుగొనబడింది.మొదటి రాజవంశం కాలం (3150 B.C.- 2613 B.C.) ప్రారంభంలో రాజు నార్మర్ పాలించిన ప్రాంతంలో ఈ బీరు ఫ్యాక్టరీ కనుగొనబడిందని ఈజిప్టు పురావస్తు శాఖ అధికారులు వెల్లడించారు.

 Beer Factory, Digging, World Wide, 450km, 1990, 8 Feet,latest Viral News-TeluguStop.com

ఈ పురాతన బీర్ ఫ్యాక్టరీలో మొత్తం 8 భారీ యూనిట్స్ ఉన్నాయని శాస్త్రవేత్తలు కనిపెట్టారు.

అయితే ఒక్కొక్క యూనిట్ 20 మీటర్లు అనగా 65 అడుగుల పొడవు ఉంది.అలాగే ఒక్కో యూనిట్ వెడల్పు 2.5 మీటర్ల అనగా 8 అడుగులు ఉంది.ప్రతి యూనిట్ లో రెండు నిలువు వరుసలు ఉండగా.

ప్రతి వరుసలో 40 భారీ పరిమాణం గల కుండలు ఉన్నాయి.ఈ కుండలలో ధాన్యాలు, నీరు కలిపి బాగా వేడి చేసి బీరును ఉత్పత్తి చేసేవారట.

అయితే చాలా కాలం క్రితం ఏర్పాటుచేసిన ఈ బీర్ ఫ్యాక్టరీ లో పెద్ద మొత్తంలో బీరు ఉత్పత్తి చేసే వారని.అప్పటి రాజ కార్యక్రమాలలో ఎక్కువగా బీరు వినియోగించే వారని.అక్కడ లభించిన ఆధారాల ప్రకారం శాస్త్రవేత్తలు చెబుతున్నారు.1900 కాలంలోనే ఈజిప్టులో అత్యంత పురాతనమైన బీర్ ఫ్యాక్టరీ ఉందని బ్రిటిష్ ఆర్కియాలజిస్టులు వెల్లడించారు కానీ ఆ బీర్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉందో కనిపెట్ట లేకపోయారు.కానీ 120 ఏళ్ల తర్వాత న్యూయార్క్, ప్రిన్స్టన్ యూనివర్సిటీ లకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్తలు తమ పరిశోధన లో ప్రపంచం లోనే అత్యంత పురాతనమైన బీర్ ఫ్యాక్టరీ ని కనుగొనగలిగారు.

ఎబిడాస్ నగరంలో పురాతన ఈజిప్ట్ కి సంబంధించిన దేవాలయాలు, స్మశానవాటికలు చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి.

అందుకే ఈ ప్రాంతానికి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది పర్యాటకులు వస్తుంటారు.గత రెండు సంవత్సరాల వ్యవధిలోనే ఈ ప్రాంతంలో అనేక పురాతన ఆవిష్కరణలు కనుగొనబడినవి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube