టెక్నాలజీ: ఫేక్ న్యూస్ కు చెక్ పెట్టేందుకు గూగుల్ నయా ఫీచర్..

గూగుల్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తూ ఉంటుంది.అయితే ఇటీవల సోషల్ మీడియాలో అసత్యపు వార్తలు ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయి.

 Google, New Update, New Features, Fake News, Technology Updates,socil Media-TeluguStop.com

ఫేక్ న్యూస్ వల్ల ప్రజలు భయాందోళలనకు గురవుతున్నారు.దీంతో ఫేక్ న్యూస్ ప్రచారాన్ని ఆపేందుకు, ఫేక్ న్యూస్ ఏంటో తెలుసుకునేందుకు గూగుల్ ఓ కొత్త ఫీచర్ ను తీసుకురానుంది.

ప్రస్తుత కాలంలో చాలా మంది కావాలనే అసత్యపు వార్తలను సృష్టించి.ఆ సమాచారాన్ని వైరల్ చేస్తున్నారు.

కొంతమంది తెలియక ఆ సమాచారాన్ని నమ్ముతూ ఇతరులకు షేర్ చేస్తున్నారు.ఈ కరోనా కష్ట కాలంలో ఫేక్ న్యూస్ ను అరికట్టడం, గుర్తించడం చాలా ముఖ్యం.

అందుకే గూగుల్ కొత్త ఫీచర్ ను తీసుకురావడానికి ప్లాన్ చేసింది.

కేవలం గూగుల్ మాత్రమే కాదు.

అసత్యపు వార్తలను, ప్రచారాలను గుర్తించడానికి సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్‌బుక్, ట్విట్టర్ కూడా ముందుకు వచ్చాయి.ఫేస్ బుక్ ఆల్రెడీ మానిపులేటెడ్‌ మీడియా లేబుల్‌ తో ఫేక్‌ ఇన్ఫర్మేషన్ ను ఫిల్టర్‌ చేసే పనిని స్టార్ట్ చేసింది.

గూగుల్‌ సెర్చ్‌ విభాగంలో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తేనుంది.ఈ ఫీచర్ సహాయంతో ఏదైనా సమాచారాన్ని గూగుల్‌ లో పేస్ట్‌ చేసి, సెర్చ్‌ చేస్తే అది ఫేక్‌ న్యూస్‌ అవునో కాదో ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు.

ఇటీవల జరిగిన ఓ గూగుల్ సమావేశంలో ఈ ఫీచర్‌ గురించి చర్చించారు.సెర్చ్‌లో ‘అబౌట్‌ దిస్‌ రిజల్ట్‌’ ఫీచర్‌ ను తీసుకొస్తే.

ఫేక్ న్యూస్ ఎక్కడ క్రియేట్ అయ్యింది, ఎక్కడి సోర్స్‌ నుండి షేర్ చేయబడిందో ఈజీగా తెలిసిపోతుంది.

ఇకపై వెబ్‌ సైట్‌ లను యూజర్లు చూస్తున్న సమయంలో వాటి వికిపీడియా పేజీల లింక్‌లు కూడా యూజర్లకు కనిపించనున్నాయి.

ఇందుకోసం గూగుల్ వికిపీడియాతోనూ కూడా పని చేయబోతోంది.ఒకవేళ వెబ్‌సైట్లకు వికీపీడియా పేజీలు లేని పక్షంలో ఆ వెబ్ సైట్ ల గురించి గూగులే తన యూజర్లకు ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది.

హెచ్‌టీటీపీఎస్‌ ఆధారంగా వెబ్‌సైట్‌ సేఫ్ ఏ నా? కాదా? అనే విషయాన్ని కూడా గూగుల్‌ చూపించనుంది.దీని ద్వారా బ్రౌజింగ్‌ డేటా గోప్యంగా ఉందొ లేదో కూడా తెలుసుకోవచ్చు.

ఈ ఫీచర్ మొదటగా యూజర్లందరికీ ఇంగ్లిష్ లో ఈ నెలాఖరులోగా అందుబాటులోకి రానుంది.తొలుత ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ ​తో పాటు డెస్క్​టాప్ వర్షన్లకు రానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube