టీడీపీ నుంచి ఫ‌స్ట్ వికెట్ ఆయ‌నేనా?

రాష్ట్రంలో పుంజుకోవాల‌ని పెద్ద ఎత్తున కృషి చేస్తున్న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ జ‌న‌సేన‌.త్వ‌ర‌లోనే సిట్టింగుల‌ను, మాజీల‌ను త‌న పార్టీలోకి పిల‌వాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

 Amanchi Krishna Mohan To Join Janasena1-TeluguStop.com

ఇక‌, ప‌వ‌న్ ఎప్పుడు పిలుపునిస్తాడా? అప్పుడు ఆ పార్టీలోకి జంప్ చేయాల‌ని ఇత‌ర పార్టీల నేత‌లు సైతం ఎదురు చూస్తున్నారు.ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో ప్ర‌దాన పార్టీలుగా ఉన్న టీడీపీ, వైసీపీల నుంచి నాయ‌కులు ఎప్పుడు ఎటునుంచి జ‌న‌సేన‌లోకి జంప్ చేస్తారోన‌నే టెన్ష‌న్ ఆ పార్టీల్లో ప‌ట్టుకుంది.

దీంతో పార్టీల అధినేత‌లు.త‌మ త‌మ నాయ‌కులు పార్టీ నుంచి చేజార‌కుండా చేసేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి.అడిగిన వారికి అడిగిన‌న్ని వ‌రాలు అన్న చందంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి.ఈ ప‌రిణామం.రాజ‌కీయంగా సంచ‌ల‌నం రేపుతోంది

అయితే, ఆయా పార్టీల నాయ‌కులు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నా.వెళ్లిపోవాల‌ని భావిస్తున్న నాయ‌కులు మాత్రం వారి ప్ర‌య‌త్నాలు వారు చేసుకుంటూనే ఉన్నారు.తాజాగా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌.త్వ‌ర‌లోనే జ‌న‌సేన‌లోకి చేర‌నున్నార‌నే వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.మ‌రి ఈయ‌న ఎందుకు ఇలా పార్టీ మారాల‌ని భావిస్తున్నాడు? అనే విష‌యాన్ని ప‌రిశీలిస్తే.ఆస‌క్తిక‌ర అంశాలు వెలుగు చూస్తున్నాయి.

ప్రకాశం జిల్లా చీరాల నుంచి 2009లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా, 2014లో ఇంటిపెండెంట్‌గా విజయం సాధించిన ఆమంచి కృష్ణమోహన్ ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు.ఆయ‌న‌కు ప్ర‌జ‌ల్లో మంచి పేరుంది.

స‌మ‌యానికి త‌మ స‌మ‌స్యలు ప‌రిష్క‌రిస్తాడ‌నే గుర్తింపూ ఉంది.అయితే, ఆమంచి మాత్రం పార్టీ మారాల‌ని నిర్ణ‌యించుకోవ‌డం గ‌మ‌నార్హం.

దీనికి పార్టీలోనే పెద్ద చ‌ర్చ జ‌రుగుతోంది.చీరాల టికెట్‌పై ఇద్ద‌రు కీల‌క టీడీపీ నేత‌లు క‌న్నేయ‌డ‌మే ఆమంచిని ఇబ్బందుల్లోకి నెడుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.2019లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయటం ఖాయమని ఎమ్మెల్సీ పోతుల ఒక‌ప‌క్క‌, ఎమ్మెల్సీ కరణం బలరాం తన కుమారుడికి ఈ టికెట్ ఇప్పించుకునేందుకు భారీ ఎత్తున ట్రై చేస్తున్నార‌నే వార్త‌లు మ‌రోప‌క్క ఆమంచికి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.దీంతో ఆయ‌న ఈ విష‌యాన్ని సీఎం చంద్ర‌బాబుదృష్టికి తీసుకు వెళ్లార‌ని ఆయ‌న అనుచ‌రులు చెబుతున్నారు.

అయిన‌ప్ప‌టికీ.బాబు నుంచి ఎలాంటి స‌మాధాన‌మూ రాలేద‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ టికెట్‌ను ఎవ‌రికి కేటాయిస్తార‌నే విష‌యంపై క్లారిటీ లేక‌పోగా.

త‌న‌కు మాత్రం ఇవ్వ‌ర‌నే ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఇక తాను పార్టీ నుంచి త‌ప్పుకోవ‌డ‌మే మంచిద‌ని ఆమంచి భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది.ఈ క్ర‌మంలోనే ఆయ‌న జ‌న‌సేన‌ వైపు దృష్టి పెట్టార‌ని తెలుస్తోంది.

ఒక‌వేళ ఆమంచి క‌నుక జ‌న‌సేన తీర్థం పుచ్చుకుంటే.అధికార టీడీపీ నుంచి ప‌డిపోయే తొలివికెట్ ఆయ‌నే అవుతార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube