జవాద్‌ తుపాన్‌ పరిస్థితులపై ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లతో జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌..

ఎక్కడా ప్రాణనష్టం ఉండకూడదు.ఒక్క మరణం కూడా సంభవించొద్దు.

 Jagan Video Conference With Collectors Of Both Godavari Districts On Typhoon Jaw-TeluguStop.com

ఆ మేరకు అధికారులు పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలి.సహాయ కార్యక్రమాలు, పనుల కోసం తుపాన్‌ ప్రభావిత జిల్లాలకు రూ.10 కోట్ల చొప్పున నిధులు అందుబాటులో ఉంచండి.సహాయ చర్యల్లో ఏ లోపం ఉండకూడదు.

జిల్లాలకు వెళ్లిన ప్రత్యేక అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలి.సహాయ శిబిరాల్లో ఆహార నాణ్యత చాలా ముఖ్యం.

అలాగే మంచినీరు, టాయిలెట్లు.ప్రతి ఒక్కటీ నీట్‌గా ఉండాలి.

ఎక్కడా ఏ లోపం లేకుండా చూడాలి అన్ని జిల్లాలలో అవసరమైన ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఉండాలి.

ఆ మేరకు మరోసారి అన్ని చోట్ల పరిస్థితులు సమీక్షించండి.

ఇంకా అదనపు బృందాలను కూడా అందుబాటులో ఉంచాలి.ఎక్కడెక్కడ ముంపునకు గురయ్యే ప్రాంతాలు ఉంటాయని భావిస్తే, అక్కడి ప్రజలను ముందుగా గట్టిగా అప్రమత్తం చేయాలి.

వారిని తరలించాలి.చెరువులు, కాల్వలు, రిజర్వాయర్ల కట్టలు ఎలా ఉన్నాయన్నది చూడండి.

ఎక్కడైనా వాటికి గండ్లు పడ్డాయని తెలిసినా లేదా బలహీనంగా ఉన్నాయని గుర్తించినా వెంటనే జల వనరుల శాఖ అధికారులతో మాట్లాడండి.వెంటనే అత్యవసర మరమ్మతులు చేపట్టండి.

ఇప్పటికిప్పుడు ఉభయ గోదావరి జిల్లాలకు తుపాన్‌ ముప్పు లేనప్పటికీ, అక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండండి.ఏ పరిస్థితి అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి.

పూర్తిస్థాయిలో అప్రమత్తం: సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌శర్మ.ఉత్తరాంధ్రతో పాటు, ఉభయ గోదావరి జిల్లాలలో ఏ పరిస్థితి అయినా ఎదుర్కోవడానికి పూర్తి అప్రమత్తంగా ఉన్నామని ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌శర్మ వెల్లడించారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube