“జనసేన” పార్టీ మొదటి హామీ.. “స్త్రీ” ల ఒట్లకి “గేలం”

నిన్న, మొన్నటి వరకూ ఏపీలోని రాజకీయ పార్టీలు తమ ఉనికిని చాటుకోవడానికి.ప్రజా మద్దతు కూడగట్టడానికి.

 Janasena Party Targets Lady Voters-TeluguStop.com

విభజన హామీలు అంటూ విభజన టాపిక్ చంకనెత్తుకుని మరీ కేంద్రంపై పోరాటం చేస్తున్నట్టుగా మాట్లాడుతూ తెగ హడావిడి చేశాయి.అయితే జనం ఎప్పటిలాగానే కాస్తంత ఎంటర్టైన్మెంట్ అవ్వగానే తమ పనుల్లో బిజీ అయిపోయారు అయితే ఇప్పుడు జనాలని మళ్ళీ తమ పార్టీల వైపు తిప్పుకోవాలి అంటే తప్పకుండా ఎదో ఒక అస్త్రాన్ని ప్రజలపై ఉపయోగించాలి అయితే

ఊసులో లేని జనసేన లాంటి పార్టీ జనాల నోళ్ళలో నానాలి అంటే తప్పకుండా ఎదో ఒక టాపిక్ ఆ పార్టీ ఎత్తు కోవాల్సొందే అయితే.జనసేనని ఆ ప్రయత్నాన్ని మెల్లగా మొదలు పెట్టాడు.అందులో భాగంగానే హామీల వర్షాన్ని మెల్లగా కురిపిస్తున్నాడు.

ఈ క్రమంలోనే ఏపీలో మహిళా ఓట్లే టార్గెట్ గా ఒక హామీని ప్రకటించాడు కూడా.వివరాలలోకి వెళ్తే

జన‌సేన పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకి ఉచిత వైద్యం అందుబాటులోకి తెస్తా అంటూ ఉచిత వాగ్ధానం చేసేశాడు…పవన్ కళ్యాణ్ జ‌న‌సేన అధికారంలోకి వ‌చ్చాక ఉత్త‌మ పాల‌న చూస్తార‌ని ఆయ‌న చెప్పారు…ఉచిత వైద్యం అంటే అది ఏరకంగా ఉంటుంది ఎటువంటి పరీక్షలు ఉచితంగా చేస్తారు ఇలాంటి విషయాలు బయటకి చెప్పక పోయినా ఉచితం అనే మాట మాత్రం వాడేశారు.

అయితే జనసేనాని ఈ ప్రకటన వెనుకాల వ్యూహాత్మక ఆలోచన ఉందని టాక్ వినిపిస్తోంది.ఎందుకంటే ఏపీలో ఏ పొలిటికల్ పార్టీకి అయినా మహిళా ఓట్లు టార్గెట్ గా చేసుకుని రాజకీయాలు చేస్తారు ఎందుకంటే.

మహిళా ఓటర్లు గనుకా ఒక్క సారి ఫిక్స్ అయ్యి ఫలానా పార్టీ కి వేయాలని అనుకుంటే ఆ పార్టీ విజయం వైపు దూసుకుని పోవడం ఖాయం అంతే కాదు నలుగురితో ఓటు వేయించే కెపాసిటీ కూడా వారిలో ఉంది అయితే జనసేనానికి యూత్ లో ఉన్న క్రేజ్ కి ఎలాగో ఉంది యూత్ ఓట్లు అధిక శాతం జనసేన పార్టీకే అనేది అందరికీ తెలిసిన విషయమే అయితే మహిళా ఓట్లు సైతం అధిక సంఖ్యలో గనుకా పవన్ తన వైపు తిప్పుకో గలిగితే తపకుండా వచ్చే ఎన్నకల్లో కర్ణాటకలో జేడీయు పార్టీలా ఏపీలో చక్రం తప్పచ్చు అనేది పవన్ ఆలోచనగా భావిస్తున్నారు విశ్లేషకులు అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ స్ర్తీల ఓట్లే టార్గెట్ గా ఈ ఉచిత హామీ ని ప్రకటించాడని అంటున్నారు విశ్లేషకులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube