జనసేన కాదు కాపుసేన..అన్న అడుగులో తమ్ముడు అడుగులు

పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేశారు.దాదాపు వైసీపి గెలుపు ఖాయం అనుకున్నారు అందరు అయితే పవన్ కళ్యాణ్ దెబ్బకి జగన్ సీఎం ఆశలు గల్లంతు అయ్యాయి.

 Janasenakadhu Kapu Sena-TeluguStop.com

ఈ క్రమంలోనే గడిచిన కొన్నేళ్లుగా చంద్రబాబు కి సపోర్ట్ చేసుకుంటూ వస్తున్న పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించాడు.చంద్రబాబు కి వ్యతిరేకంగా పావులు కదిపారు.

ప్రత్యక్ష రాజకీయాలలోకి వెళ్ళాలని భావించిన పవన్ కళ్యాణ్ ఆదిశగా అడుగులు వేస్తున్నాడు…ఈ దశలోనే పవన్ కళ్యాణ్ అన్ని పార్టీల అధినేతలు పాటిస్తున్న మార్గంలోకే వెళ్తున్నాడు.తన అన్న అడుగు జాడలలో అడుగులు వేస్తూ తానూ ఓ సాధారణ రాజకీయ నాయకుడు అనిపించుకున్నాడు.

అసలు విషయం ఏమిటంటే.

రాజకీయాలు అంటేనే కుల ప్రాతిపదికగా నడుస్తాయి.

ఏపీలో రాజకీయలు ఈ విషయంలో మొదటి స్థానంలో ఉంటాయి.కమ్మ సామాజిక వర్గం చంద్రబాబు కి ,రెడ్డి సామాజిక వర్గం జగన్ మోహన్ రెడ్డి కి ఎలా అయితే కొమ్ము కాస్తాయి అన్ని విషయం ఓపెన్ సీక్రెట్ అని అందరికీ తెలుసు.

అయితే అధినేతలు మాత్రం కులాలకి అతీతం అని చెప్పినా సరే వారు చేసే పనులు చేసుకుంటూ వెళ్తారు….అయితే ఇప్పుడు పవన్ చుట్టూ కూడా కాపులు కీలకంగా ఉంటున్నారు.

రోజు రోజుకి కాపులు చేరిపోతున్నారు.


ఇదంతా కామన్ గా జరిగే విషయమే కదా అన్ని పార్టీలలో అనుకోకండి.తెలుగు దేశం పార్టీ కి కాని , వైసీపి పార్టీకి కాని కులం రంగు ఎప్పుడు అంటుకోలేదు.కేవలం వారి వారి కులాలు ఎక్కడా వారి చుట్టూ కనిపిచరు.

కానీ ప్రజారాజ్యం పెట్టిన కొత్తలో ఇది కాపుల పార్టీ అంటూ వచ్చిన టాక్ చిరంజీవి పొలిటికల్ కెరియర్ కి మాయని మచ్చని మిగిల్చింది.ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ కులం ముద్రనే పూసుకున్తున్నాడు చివరికి మరి చిరంజీవిలా దెబ్బతింటాడు అంటున్నారు విశ్లేషకులు.

ఎందుకంటే ఇటీవల జనసేన తన కార్యవర్గంతోపాటు మీడియా కో ఆర్డినేషన్ పర్సన్స్ ను ప్రకటించింది.

అయితే ఈ లిస్టు చూస్తే.

కాపులు జనసేనకి ఎంత దగ్గర అవుతున్నారో అర్థం అవుతుంది…ముఖ్యంగా PRO హరిప్రసాద్, తిరుపతి డాక్టర్ హరి ప్రసాద్, అనంతపురం అశోక్, మాదాసు గంగాధర్, స్పోక్స్ పర్సన్ అద్దేపల్లి శ్రీధర్ సహా ముఖ్య నేతలు అంతా కూడా కాపులే ఉండటం విశేషం.టీడీపీపై ఎదురుదాడి మొదలు పెట్టినప్పటి నుంచి తప్పనిసరి పరిస్థితుల్లో పవన్ కాపులతోనే బండి లాగిస్తున్నట్లు కనిపిస్తోంది.

కమ్మ, రెడ్డి, ఎస్సీ, ముస్లింలకు ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తున్నా సరే ఆదిశగా అడుగులు మాత్రం వేయలేక పోతున్నాడు

దీనికితోడు టీడీపీ, కాంగ్రెస్ లోని కాపు నాయకులు కొందరు జనసేనలో చేరిపోవాలనే ప్రయత్నం చేయడంతో పవన్ కెరియర్ అన్న కెరియర్ లా అవుతుంది అనే భయం కూడా లేకపోలేదు అయితే ఇదంతా కావాలని పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా తొక్కడానికి పన్నుతున్న వ్యూహాలలో భాగం అని అంటున్నారు మరి కొంతమంది విశ్లేషకులు ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ ఈ సమయంలో కొంచం జాగ్రత్తగా ఉండటం ఎంతో ముఖ్యం అనేది అభిమానుల కోరిక.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube