జనసేనపై చరణ్‌ ఆసక్తి.. ఇదే సాక్ష్యం

గతంలో మెగాస్టార్‌ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపింపిచనప్పుడు మెగా ఫ్యామిలీ హీరోలు అయిన రామ్‌ చరణ్‌ మరియు అల్లు అర్జున్‌ ప్రత్యేక ప్రచారం చేసిన విషయం తెల్సిందే.ఇక పవన్‌ కళ్యాణ్‌ అప్పట్లో చాలా యాక్టివ్‌గా యువ రాజ్యం అధ్యక్షుడా రాజకీయాలు చేశాడు.

 Ram Charan Campaign For Janasena-TeluguStop.com

అయితే అనుకున్న స్థాయిలో ప్రజారాజ్యం ప్రజల నమ్మకంను పొందడంలో విఫలం అయ్యింది.అదే సమయంలో కాంగ్రెస్‌ సీఎం రాజశేఖర్‌ రెడ్డి ముందు ఆ పార్టీ నిలబడటంలో విఫలం అయ్యింది.

దాంతో చిరంజీవి చివరకు తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేశాడు.ఇదంతా గతం, ప్రస్తుతం విషయానికి వస్తే పవన్‌ పార్టీ జనసేన వైపు అందరు చూస్తున్నారు.

మొదట జనసేనను కూడా మరో ప్రజారాజ్యం అంటూ అంతా విమర్శలు చేశారు.కాని పవన్‌ వేస్తున్న ఒక్కో అడుగు ప్రజల్లో నమ్మకంను కలిగిస్తుంది.అధికారం ముఖ్యం కాదు, ప్రజల సమస్యలపై పోరాడటం తనకు ముఖ్యం అంటూ పవన్‌ చెబుతూ వస్తున్నాడు.పవన్‌ కళ్యాణ్‌కు మద్దతుగా ఎంతో మంది అభిమానులు మరియు నాయకులు కూడా నిలుస్తున్నారు.

ప్రస్తుతం జిల్లాల పర్యటనలో ఉన్న పవన్‌ కళ్యాణ్‌కు మద్దతుగా రామ్‌ చరణ్‌ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.బాబాయి ప్రజల కోసం కష్టపడుతున్నాడు.

ఆయన్ను చూస్తే గర్వంగా ఉందని చెప్పుకొచ్చాడు.

ఎండ, వానా లెక్క చేయకుండా బాబాయి ప్రజల పక్షంలో పోరాటం చేస్తుంటే బాధపడాల్సిన పనేముందని, ఆయన చేస్తున్న పనిని అభినందించాల్సిందే అంటూ తాజాగా ఒక మీడియా సమావేశంలో రామ్‌ చరణ్‌ చెప్పుకొచ్చాడు.

అదే సమయంలో జనసేన పార్టీపై మీ అభిప్రాయం ఏంటీ, ఆ పార్టీ ప్రచారంకు మీరు వెళ్తారా అంటూ మీడియా వారు రామ్‌ చరణ్‌ను ప్రశ్నించిన సమయంలో చరణ్‌ పాజిటివ్‌గానే రియాక్ట్‌ అయ్యాడు.బాబాయి ఆదేశిస్తే పార్టీ కోసం ఏం చేసేందుకు అయినా సిద్దం అంటూ చెప్పకనే చెప్పాడు.

బాబాయి అంటే చరణ్‌కు చాలా అభిమానం.ఆ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

బాబాయిపై ఇష్టంతో పాటు, ఆయన భావాలు, పార్టీ విధానాలు కూడా నచ్చిన రామ్‌ చరణ్‌ జనసేన సభ్యుడిగా జాయిన్‌ అయ్యేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది.అతి త్వరలోనే జనసేన పూర్తి స్థాయి ప్రచార విభాగంను ఏర్పాటు చేస్తున్నారు.

అందులో రామ్‌ చరణ్‌కు పవన్‌ ఏమైనా స్థానం కల్పిస్తాడేమో చూడాలి.పవన్‌ కళ్యాణ్‌ పార్టీలోకి కుటుంబ సభ్యులను తీసుకు రాకపోవచ్చు అంటూ కొందరు అంటున్నారు.

అయితే స్వచ్చంధంగా వస్తానంటూ ముందుకు వచ్చే రామ్‌ చరణ్‌ను పవన్‌ ఆపక పోవచ్చు అంటూ మరికొందరు అంటున్నారు.వచ్చే సంవత్సరం జరగబోతున్న ఎన్నికల్లో జనసేనకు చరణ్‌ ప్రచారం చేస్తే ఫలితం తప్పకుండా అనుకూలంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube