జగన్ ,చంద్రబాబు ఇద్దరికీ కేంద్రం ఝలక్...నెక్స్ట్ సీఎం..?

ఏపీ రాజకీయాల్లో సంచలన మార్పులు జరుగనున్నాయా.?ఎవరి ఊహాలకీ అందని విధంగా కేంద్రం భారీ ఆపరేషన్ కి పూనుకుంటోందా.? వచ్చే ఎన్నికల్లో సీఎం అయ్యే ఛాన్స్ చంద్రబాబు,జగన్ లలో ఇద్దరికీ లేదా…? ఇప్పుడు ఈ వార్తలే సెన్సేషనల్ అవుతున్నాయి.గత కొన్ని రోజులుగా ఏపీలో జరుగుతున్న పరిస్థితుల్ని బట్టి చూస్తే ఈ వార్త నిజమేనేమో అనుకోవాల్సి వస్తోంది అంటున్నారు విశ్లేషకులు…ఏపీ సీఎం గా అటు చంద్రబాబు కి కాని జగన్ కి కాని అవకాశం లేకుండా కేంద్రం మాస్టర్ ప్లాన్ చేస్తోందని టాక్ వినిపిస్తోంది.

 Shocking News Bjp Game Plan 2019 Election Plan-TeluguStop.com

వివరాలలోకి వెళ్తే .

కేంద్రం ఏపీకి చేసిన మోసాన్ని ఏపీ ప్రజల దృష్టిటికి తీసుకుని వెళ్లి బీజేపీ ని ప్రజలలో బూచిని చేసి ఓట్లు కొల్లగొట్టాలనేది చంద్రబాబు ప్లాన్.ఇదిలా వుంటే మరికొందరు వచ్చే ఎన్నికల్లో జగన్ దే చాన్స్ అంటున్నారు.గత ఎన్నికల్లోనే జగన్ కు విజయం తృటిలో తప్పిపోయింది.దాంతో ఈసారి జగన్ కి అవకాశం తప్పకుండా ఉంటుంది అనేది కొందరి విశ్లేషకుల వాదన .

అయితే…ఇక్కడే అసలు ట్విస్ట్ మొత్తం ఉంది.కేంద్రం వేసిన భారీ ప్లాన్ తో జగన్ చంద్రబాబు ఇద్దరిలో ఒక్కరు కూడా సీఎం అయ్యే అవకాశాలు లేవని టాక్ వినిపిస్తోంది.అయితే ఇద్దరు కాకపోతె ఇంకెవరును సీఎం అయ్యే అవకాశం ఉంది.

కేంద్రం ఎవరి పేరుని తెరపైకి తీసుకువచ్చే అవకాశం ఉంది అనే విషయాలని హీరో శివాజీ చెప్తున్నారు.కానీ నటుడు శివాజీ చెప్తున్న విషయాలు మాత్రం సంచలనం సృష్టిస్తున్నాయి.

శివాజీ ఏమంటున్నారంటే.?

వచ్చే ఎన్నికల్లోపు అవినీతి ఆరోపణలపై చంద్రబాబు, వైఎస్ జగన్ ఇద్దరినీ జైలుకు పంపుతారని.జగన్ అండతో ఎన్నికల్లో గెలిచిన సదరు జాతీయ పార్టీ అధికారం చేపట్టబోతోందని ఇందుకోసం ఒక దారుణమైన భారీ కుట్రకు కేంద్రం పావులు కదుపుతోందని తెలుస్తోందని శివాజీ వెల్లడించారు…అయితే వచ్చే ఎన్నికల్లో ఏపీ సీఎం గా బీజేపీ నేత రామ్ మాధవ్ కానీ.జీవీఎల్ నరసింహారావు కానీ అయ్యే అవకాశం ఉంది టాక్.

ఇదే నిజం అయితే బీజేపీకి పుట్టగతులు ఉండవని దేశవ్యాప్తంగా తీవ్రమైన ప్రభావం బీజేపీ పై ఉంటుందని విశ్లేషకుల అభిప్రాయం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube