“జగన్” కి కష్టాలు తెచ్చి పెడుతున్న “జగన్ సొంత సర్వే”

జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రజా క్షేత్రంలో దూసుకుని వెళ్తోంది.ప్రజలు అందరూ బ్రహ్మరధం పడుతున్నారు.

 “జగన్” కి కష్టాలు తెచ్చి పెడు�-TeluguStop.com

ఎక్కడికి వెళ్ళినా సరే జై జగన్ అంటూ నినాదాలు మారు మోగుతున్నాయి.అయితే ఇదంతా గతం అంతేకాదు గతంలో కొన్ని ప్రాంతాలవరకూ జగన్ మైలేజ్ బాగానే ఉన్నా సరే తరువాత అరువు తెచ్చుకున్న ప్రజలతో పాదయాత్ర ముందుకు సాగుతోంది.

రాయలసీమలో వచ్చిన రెస్పాన్స్ ప్రకాశం జిల్లా వచ్చేసరికి డీలా పడిపోయింది.అంతేకాదు గుంటూరు ,ప్రకాశం ,కృష్ణా జిల్లాలు వచ్చేసరికి మరింతగా జగన్ గ్రాఫ్ తగ్గిపోయిందట అయితే ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకుంటున్న బీజేపి అధిష్టానం జగన్ కి ఆదరణ తగ్గుతున్న క్రమంలో పీకే కి పాదయాత్రకి సంభందించిన రిపోర్టులు ఇవ్వమని చెప్పిందట.

అయితే పీకీ ఎప్పటికప్పుడు నియోజకవర్గ స్థాయిలో చేయించే రిపోర్టులని బీజేపి అధిష్టానానికి పంపాడట దాంతో ఆ రిపోర్ట్స్ చూసినబీజేపి అధిష్టానానికి మరియు జగన కి దిమ్మ తిరిగిపోయిందట.ఎంతో మంది తమ తమ అభిప్రాయాలని ఒకే విధంగా తెలుపడం ఆశ్చర్యం కలిగించిందట.పాదయాత్ర పరంగా సక్సెస్ అవుతున్న జగన్ శుక్రవారం కోర్టు మెట్లు ఎక్కేసరికీ అప్పటి వరకూ ఉన్న ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయ్యిపోతోందట.

ఈ విషయాన్ని అందరు ఒకే లా తమ తమ అభిప్రాయాల్ని తెలిపారట.

ఇదిలాఉంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు కనుకా జరిగితే తెలుగు దేశం బలం పుంజుకోవటం అనివార్యమని పీకే తెలిపినట్టుగా తెలుస్తోందట.

చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నట్టు గా ప్రజలలో ఒక రకమైన అభిప్రాయం బలం గా నాటుకుపోయిందని కేంద్రం మోసం చేసినా ఆయన సొంత గా ఎదో కష్టపడుతున్నారనే భావన ప్రజలలో నాటుకు పోయిందని తెలిపారట.కొంత మంది నాయకుల వల్ల వైకాపా సభ్యత లేని పార్టి అని ముద్ర పడినట్టుగా కూడా తెలిపారట.

చంద్రబాబు పై చేస్తున్న విమర్సల వలన అందరూ కలిసి ఒక్కడిని చేసి ఆయనపై పోరాటం చేస్తున్నారా అనే యాంగిల్ లో సానుభూతి వెళ్తోందని తెలుస్తోందట.

అంతేకాదు రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు గనుకా జరిగితే టీడీపికి 110 -125 సీట్లు ఖాయం గా వస్తాయని, వైకాపా జనసేన బిజెపి విడిగా పోటి చేస్తే లాభం ఉంటుందని తెలిపారట…అయితే ఈ రిపోర్ట్ చూసిన బీజేపి కి చుక్కలు కనిపించడంతో జగన్ కి హెచ్చరికలు జారీ చేశారట.

ఇక మీదట అయినా సరే కొంచం శ్రద్ద వహించమని వ్యుహాలకి పదును పెట్టమని సూచనలు చేశారట.అయితే మళ్ళీ మూడు నెలల తరువాత తాజా రిపోర్ట్ పంపమని పీకే కి తెలిపినట బీజేపి అధిష్టానం మరి ఆ రిపోర్ట్ చూసి జగన్ భవిష్యత్తు డిసైడ్ చేస్తారేమో వేచి చూడాలి అంటున్నారు విశ్లేషకులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube