ముహూర్తం బాగాలేదని వెళ్లని జగన్‌.. సోషల్‌ మీడియాలో విమర్శలు

ప్రత్యేక ఏపీకి రెండవ సీఎంగా వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెల్సిందే.ఏ ముఖ్యమంత్రి అయినా కూడా పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సచ్చివాలయంకు వెళ్లి పదవి బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది.

 Cm Ys Jagan Mohan Reddy Not Went To Secretariat-TeluguStop.com

అక్కడ రాష్ట్రంకు సంబంధించిన సమస్యలు, పరిస్థితుల గురించి సమీక్షించడం జరుగుతుంది.నిన్న ప్రమాణ స్వీకారం చేసిన జగన్‌ నేడు సచ్చివాలయంలో అధికారులతో సమీక్షలు నిర్వహించాలని భావించారు.

నేడు సచ్చివాలయానికి సీఎం హోదాలో జగన్‌ మొదటి సారి రాబోతున్న నేపథ్యంలో వెలగపూడిలోని ఏపీ సచ్చివాలయంను సర్వాంగ సుందరంగా అలంకరించడం జరిగింది.కాని చివరి నిమిషంలో జగన్‌ సచ్చివాలయంకు నేడు రావడం లేదు అంటూ అధికారులకు సమాచారం ఇచ్చారు.

సీఎంగా మొదటి సారి సచ్చివాలయంకు అడుగు పెట్టబోతున్న కారణంగా మంచి ముహూర్తం చేసుకోవాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నాడట.

నేడు మంచి ముహూర్తం కాదని, అందుకే జగన్‌ నేడు సచ్చివాలయ ఎంట్రీ లేదని టాక్‌ వినిపిస్తున్న నేపథ్యంలో సోషల్‌ మీడియాలో కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జగన్‌ ఇలా వారాలు వజ్రాలు అంటూ కాలయాపన చేయడం ఏమాత్రం కరెక్ట్‌ కాదని, గత ముఖ్యమంత్రి మాదిరిగా కాకుండా కొత్త సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్ట్ర అభివృద్దికి పాటుపడాలంటూ సోషల్‌ మీడియాలో కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube