చంద్రయాన్‌ 2 : ఆ 15 నిమిషాలు చాలా కీలకం

నేడు అర్థరాత్రి దాటిన తర్వాత చందమామపై మన జెండా ఎగరబోతుంది.ఇస్రో పంపించిన చంద్రయాన్‌ 2 కొద్ది సేపట్లో చందమామపై విక్రమ్‌ ల్యాండర్‌ కాలు మోపబోతుంది.

 2 Chandrayaan 2 Vikram Lander To Make Soft Landing-TeluguStop.com

చందమామపై విక్రమ్‌ కాలు మోపే ఆ 15 నిమిషాలు చాలా కీలకం అంటూ ఇస్రో చైర్మన్‌ శివన్‌ అన్నారు.ఇన్ని రోజులు తాము అనుకున్నట్లుగా ప్రయోగం సాగింది.

ఆ పదిహేను నిమిషాలు మాకు అత్యంత కీలకం అని, చంద్రుడిపై ఉండే గురుత్వాకర్షనను తట్టుకుంటూ మెల్లగా విక్రమ్‌ చంద్రుడిపై ల్యాండ్‌ అవ్వడం అనేది కాస్త కష్టమైన పనే అని అయితే తాము ప్రణాళిక బద్దంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, అందుకే ఖచ్చితంగా సక్సెస్‌ అవుతుందనే నమ్మకం వ్యక్తం చేశాడు.

చంద్రయాన్‌ 2 నేడు రాత్రి 1.30 కి చంద్రుడిపై కాలు మోపనుంది.ఆ సమయంలోనే ప్రజ్ఞాన్‌ రోవర్‌ విడిపోయి చంద్రుడిపై పరిశోదన చేసి అక్కడ విషయాలను పంపించబోతుంది.

అదే కనుక జరిగితే ప్రపంచ చరిత్రలో ఇండియా నిర్వహించిన చంద్రయాన్‌ 2 నిలిచి పోనుంది.ఇప్పటి వరకు చంద్రుడిపై కాలుమోపిన దేశాల జాబితాలో ఇండియా కూడా చేరబోతుంది.

ఈ ప్రయోగంతో రాబోయే కాలంలో వ్యోమగామిని కూడా ఇండియా పంపించే అవకాశం ఉంది.మరి కొన్ని గంటల్లో జరుగబోతున్న అద్బుతాన్ని చూసేందుకు దేశం మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోంది.

ప్రతి ఇండియన్ గర్వపడే ఆ సందర్భం మరి కొన్ని గంటల్లో ఆవిష్కారం కాబోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube