చంద్రబాబు విషయంలో షా కి తలంటిన ఆరెస్సెస్

ఏపీ రాజకీయాల్లో సక్సెస్ఫుల్ నేతగా ఎంతో అపారమైన అనుభవం ఉన్న నేతగా ఉన్న ఏకైక వ్యక్తి ఏపీ సీఎం చంద్రబాబు జాతీయ స్థాయిలో చంద్రబాబు కి ఉన్న క్రేజ్ మరే రాష్ట్ర సీఎం కి లేదనడంలో సందేహం లేదు.ఒకానొక దశలో ప్రధానిగా అవకాశం వచ్చినా సరే తన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి అంటూ సున్నితంగా తిరస్కరించిన వ్యక్తి ఆయన ఎంతో మంది రాజకీయ నేతలని మనం గమనిస్తే వారిపై ఆరోపణలు వచ్చినప్పుడు చాలా కోపంగా ఉద్రేకంగా స్పందిస్తారు నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతూ ఒక పార్టీ అధ్యక్షుడు అనే విషయాన్ని సైతం మర్చిపోయి ప్రవర్తిస్తారు అయితే రాజకీయాల్లో హుందాగా ఉండాలి అన్నా.

 Chandrababu Rss Amit Shah-TeluguStop.com

రాజకీయాలని తన చుట్టూ తిప్పుకోవాలన్నా అది కేవలం చంద్రబాబు నాయుడికే చెల్లింది.


అయితే అలాంటి నేతని ఈ మధ్యకాలంలో బీజేపి తన స్వార్ధ రాజకీయం కోసం ఎన్నో ఇబ్బందులకి గురిచేసింది.అంతేకాదు చంద్రబాబు లాంటి వ్యక్తి కళ్ళ వెంట నీరు కారే పరిస్థితికి తీసుకువచ్చి రాక్షసానందం పొందింది వైసీపితో ,జనసేనతో కుమ్మక్కయ్యి చంద్రబాబు ని ఒంటరి చేస్తూ ఏపీ ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని చూసింది.చేస్తోంది కూడా అయితే ఇక్కడ బీజేపి పార్టీ చేస్తోంది అనేకంటే కూడా నరేంద్ర మోడీ ,అమిత్ షా ల ద్వయం చేస్తోంది అని చెప్పడం భావ్యం

అయితే వీరిద్దరి కుయుక్తుల వలన బీజేపి పతనం ఇప్పటికే సింహబాగానికి చేరుకుంది అని చెప్పడం లో వెనకాడవలసిన అవసరం లేదు.

అయితే ఈ పరిణామాలు మాత్రం బీజేపి మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ లో గుబులు పుట్టిస్తున్నాయని తెలుస్తోంది.ఎక్కడ బీజేపి పాతాళానికి పడిపోతుందోనని ఆరెస్సెస్ పెద్దలు కంగారు పడుతున్నారని టాక్ వినిపిస్తోంది

అయితే తాజాగా పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎదురైనా ఎదురు గాలి అందరికీ తెలిసిందే అయితే ఈ విషయంపై ఆరెస్సెస్ నేతలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ఢిల్లీలోని ఆరెస్సెస్ ప్రతినిధులు అత్యవసరంగా అమిత్ షాతో సమావేశమై… జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం.ఎన్నికల్లో ఇలాంటి పరిణామాలు ఎదురుకావడానికి అసలు కారణం బీజేపీ నమ్మకమైన మిత్రులను కోల్పోవడమే అని ఆర్ఎస్ఎస్ నేతలు అమిత్ షాపై ఆగ్రహం వ్యక్తం చేశారని టాక్…అంతేకాదు ఏపీలో ఎంతో పట్టు ఉన్న టీడీపీని మీరు ఎందుకు దూరం చేసుకున్నారని… కొందరు ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు అమిత్ షాను గట్టిగా నిలదీశారని తెలుస్తోంది.

టీడీపీ, శివసేన పార్టీలు బీజేపి ని వీడిన తరువాత బీజేపి స్థాయి జాతీయ స్థాయిలో తగ్గిపోవడమే కాక ఏపీ కి చేసిన అన్యాయాలు అన్నీ కూడా జరిగిన ఎన్నికల్లో తీవ్రమైన ప్రభావం చూపించాయని అందుకే ఓటమిలు చవి చూస్తున్నాము అంటూ ఆరెస్సెస్ తీవ్రస్థాయిలో అమిత్ షా కి తలంటేసిందట.దాంతో

టీడీపీని తాము వదులుకోలేదన వాళ్ళంతట వాళ్ళే వెళ్ళిపోయారు అని షా సర్దిచెప్పుతుండగా మీరు ఇంకా ఆగండి చేసింది చాలు అంటూ ఆరెస్సెస్ పెద్దలు షా పై సీరియస్ అయ్యారట.

దాంతో చిన్నబుచ్చుకున్న షా ఏమి మాట్లాడలేక సైలెంట్ అయ్యారని టాక్ వినిపిస్తోంది.ఏది ఏమైనా చంద్రబాబు దూరం అవ్వడం ఆరెస్సెస్ కి మింగుడు పడటం లేదట అందుకే “షా మోడీ” లపై ఆరెస్సెస్ తీవ్రమైన అసంతృప్తితో ఉందని అంటున్నారు ఆరెస్సెస్ నేతలు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube