చంద్రబాబు పై షాకింగ్ కామెంట్స్ చేసిన టీటీడీ ప్రధాన అర్చకుడు..

టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చంద్రబాబు పై సంచలన ఆరోపణ చేశారు.రాష్ట్రం లో జరుగుతున్న పరిణామాలకు , అశుభాలకి కారణం చంద్రబాబు కారణం అంటూ ధ్వజమెత్తారు.

 Ttd Ramana Deekshutulu Shocking Comments On Chandrababu-TeluguStop.com

ఎన్నడూ లేని విధంగా పిడుగులు పడి ఎంతో మంది మృత్యువాత పడ్డారు అంటే దానికి కారణం చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలే అంటూ ప్రెస్ మీట్ లో తీవ్రమైన విమర్శలు చేశారు.వివరాలలోకి వెళ్తే.

ఆగమన శాస్త్ర విరుద్ధంగా చంద్రబాబు ఎన్నో తప్పులు చేస్తున్నారు…అర్చకుల వారసత్వాన్ని తీసేయాలి అనుకోవడం శాస్త్ర విరుద్ధం అని అన్నారు.స్వామి వారిని తాకే హక్కు అధికారం కేవలం ఆగమన పండితులకు మాత్రమే ఉంటుందని అన్నారు.అయితే మమ్మల్ని స్వామివారికి దూరం చేయాలని అనుకుంటున్నారు భరిస్తూ వస్తున్నాం కానీ ఇప్పుడు భక్తులకు కూడా స్వామిని దూరం చేస్తున్నారు అని మండిపడ్డారు.

తిరుమల ఎంతో పవిత్రమైనది చరిత్రకలిగినది అయితే ఇలాంటి ఈ తిరుమలలో స్వామివారి గురించి కనీసం తెలియని అధికారులని వేయడం వాళ్ళు తప్పులు చేయడం చేస్తున్నారు.

తమ అంగ,అర్ధ బలాలు పవిత్రమైన తిరుమలపై చూపిస్తున్నారు.రాజకీయ నాయకులు , సినిమా వాళ్ళు అంటూ ఇలా తమ రాజకీయ స్వార్ధం కోసం తోమల సేవ వంటి కార్యక్రమాలని ఐదు నిమిషాలలో అయ్యేలా చేస్తున్నారు.

ఎవరికో సేవలు చేయడానికి స్వామివారి సేవల్ని వాటి సమయాలని తగ్గించడం మహాపరాధం అంటూ అశేష ప్రజలు విస్తూ పోయే విషయాలు వెల్లడించారు.

ఆలయ అభివృద్ధి పేరుతో ప్లాన్ ల వంకలతో వెయ్యికాళ్ళ మండపాన్ని పడగొట్టించారు.

హైందవ ధర్మాన్ని కాలరాస్తున్నారు.భవిష్యత్తు తరాలకి వారసత్వ సంపద కనపడకుండా చేస్తున్నారు.

ఆభరణాల వివరాలు స్వామి వారి డబ్బు వివరాలు బహిరంగంగా విచారణ చేపట్టాలి అని డిమాండ్ చేశారు.అందుకోసమే రాష్ట్రపతికి ,ప్రధానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తికి , హై కోర్టు న్యాయమూర్తి కి మెమరెండం పంపాము తిరుమల కోసం మేము పోరాటం చేస్తాం ప్రజా మద్దతు మాకు ఉంటుంది అని అన్నారు దీక్షితులు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube