ప్రముఖ గాయకుడు, తెలంగాణ గిడ్డంగుల కార్పొరేషన్ సంస్థ ఛైర్మన్ సాయిచంద్ అకాల మరణం చెందిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో సాయిచంద్ భౌతికకాయానికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నివాళులర్పించనున్నారు.
అదేవిధంగా పార్టీలకు అతీతంగా పలువురు నాయకులు సాయిచంద్ భౌతికకాయానికి నివాళులర్పిస్తున్నారు.
ప్రస్తుతం సాయిచంద్ భౌతికకాయం గుర్రంగూడలోని ఆయన నివాసంలో ఉంది.
కాగా ఆయనను కడసారి వీక్షించేందుకు రాజకీయ నాయకులు, కళాకారులు భారీగా తరలివస్తున్నారు.మధ్యాహ్నం తరువాత సాయిచంద్ అంత్యక్రియలు జరగనున్నాయి.
అయితే నిన్న కుటుంబ సభ్యులతో కలిసి బిజినేపల్లి మండలం కారుకొండలోని ఫామ్ హౌస్ కు వెళ్లారు సాయిచంద్.అర్ధరాత్రి అస్వస్థతకు గురి కావడంతో కుటుంబసభ్యులు ఆయనను నాగర్ కర్నూల్ లోని గాయత్రి ఆస్పత్రికి తరలించారు.
సాయిచంద్ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ కు తరలించారు.ఈ క్రమంలో గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రికి తీసుకురాగా అప్పటికే మరణించారని వైద్యులు తెలిపారు.