క‌డ‌ప వైసీపీలో ఏం జ‌రుగుతోంది?

ఏపీ విప‌క్షం వైసీపీకి కంచుకోట‌.పార్టీ అధినేత జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో ప్ర‌స్తుతం ఆ పార్టీకి నిరుత్సాహ‌మే ఎదుర‌వుతోం దా? నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త క‌నిపించ‌డం లేదా? దీనిని గుర్తించిన అధికార టీడీపీ దూసుకు పోయేందుకు ప్ర‌య‌త్నిస్తోం దా? అల‌సు క‌డ‌ప వైసీపీలో ఏం జ‌రుగుతోంది? నేత‌లు ఎందుకు నిరాశ‌లో కూరుకుపోతున్నారు? వ‌ంటి అంశాల‌పై చ‌ర్చ న‌డుస్తోంది.వైసీపీ అధినేత జ‌గ‌న్‌.టీడీపీ అధినేత చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరుపై క‌న్నేశారు.అదేస‌మ‌యంలో చంద్ర‌బా బు.జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌పై దృష్టి పెట్టారు

 Ys Jagan Kadapa Ycp Tdp Aakarsh 1-TeluguStop.com

జ‌గ‌న్ చిత్తూరు విష‌యంలో ఎలాంటి కీల‌క నిర్ణ‌యాలు తీసుకుం టున్నారో తెలియ‌డం లేదు కానీ, చంద్ర‌బాబు మాత్రం క‌డ‌ప‌లో పాగా వేసేందుకు జ‌గ‌న్‌ను దెబ్బ‌కొట్టేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాలు మాత్రం ముమ్మ‌రంగా ఉన్నాయి.దీంతో ఇప్పుడు అస‌లు క‌డప వైసీపీ ప‌రిస్థితి ఏంటి? అనే చ‌ర్చ‌కు అవ‌కాశం వ‌చ్చింది.కడప జిల్లాలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో తీవ్ర నిరాశ నెల‌కొంది.

ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నామన్న భావ‌న వారిలో గూడుక‌ట్టుకుంది.మ‌రో ఏడాదిలోనే ఎన్నిక‌లు ఉండ‌డం, టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క వ‌ర్గాల్లో అభివృద్ధి సాగుతుండ‌గా.

వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల ఎక్క‌డి గొంగ‌ళి అక్క‌డ అన్న చందంగా ప‌రిస్థితి ఉండ‌డం వారికి క‌లిచివేస్తోంది

2014 ఎన్నికల్లో 9 స్థానాల్లో వైసీపీ, ఒకే స్థానంలో టీడీపీ గెలుపొందాయి.అయితే, చంద్ర‌బాబు వేసిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ గేలంతో రాజకీయ సమీకరణలు ఒక్క‌సారిగా మారిపోయాయి.

దీంతో జమ్మల మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే జయరాములు వైసీపీని వీడి టీడీపీలో చేరారు.దీంతో టీడీపీ బలం మూడుకు పెరగ్గా వైసీపీ ఏడుగురు ఎమ్మెల్యేలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఇక‌, గ‌డిచిన నాలుగేళ్లలో ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు, ప్రజలతో ఎలా మెలుగుతున్నా రు, ప్రజా సమ స్యల పరిష్కారం తదితర అంశాల‌ను ప‌రిశీలిస్తే.వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉంటున్న స‌మ‌యం చాలా త‌క్కువేన‌ని తెలుస్తోంది

ఇక‌, ప్రజా సమస్యల పరిష్కారం అంతంత మాత్రమేనని, విప‌క్ష ఎమ్మెల్యేలు ఏమీ చేయలేకపోయామన్న భావ‌న క‌నిపిస్తోంది.

కనీసం అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై గళం విప్పే పరిస్థితులు లేకపో వడంతో ఎమ్మెల్యేలన్న గుర్తింపు తప్ప నియోజకవర్గ సమస్యలు తీర్చిన పరిస్థితులు లేవన్నది ఆయా నియోజక వర్గాల ప్రజలు పేర్కొంటున్నారు.అధికార పక్షం ఎమ్మెల్యేలు ఉన్న నిధులను సర్దుబాటు చేసుకుని అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజలకు దగ్గరవుతూ వస్తున్నారు.

వాస్త‌వానికి పులివెందుల నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన జగన్‌కు 75 వేల ఓట్ల ఆధిక్యత రావడం తో ఇది రాష్ట్రంలో రికార్డు సృష్టించింది.అలాం టి నియోజకవర్గాన్ని జగన్‌ పూర్తిగా విస్మరించారని, ప్రజలకు అందుబాటులో ఉండరని విమర్శలున్నాయి.

కడప ఎంపీ అవినా్‌షరెడ్డి ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తూ వస్తున్నారు.ఈ నాలుగేళ్లలో ఒకటి, రెండుసార్లు తప్ప పులివెందుల అభివృద్ధిపై జగన్‌ సమీక్షలు జరిపింది లేదు.

ఎమ్మెల్యేల్లో చాలా మంది సమస్యల పరిష్కారం కన్నా సొంత వర్గీయుల కే ప్రాధాన్యం అన్నట్లుగా వ్యవహరిస్తుంటారన్న విమర్శలున్నాయి

మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ప్రొద్దుటూరులో నివాసం ఉంటూ మైదుకూరుకు అప్పుడప్పుడూ వెళుతుంటారని అంటున్నారు.రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉన్నా సమస్యలు పరిష్కరించడంలో సతమతమవు తున్నారు.

నియోజకవర్గంలో అభివృద్ధి అన్నది ఏమీ లేదు.రైల్వేకోడూ రు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉన్నా నియోజకవర్గ అభివృద్ధికి సాధించిందేమీ లేదు.

బద్వేలు ఎమ్మెల్యే టి.జయరాములు మున్సిపల్‌ కమిషనర్‌గా పనిచేస్తూ ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజలకు దగ్గరగా ఉంటున్నా పార్టీ మారడంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు

రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి టీడీపీకి ఏకైక ఎమ్మెల్యేగా గెలుపొందడంతో రాష్ట్ర విప్‌ పదవి దక్కింది.ప్రజలకు అందుబాటులో ఉంటున్నా అధికార పక్షం కావడంతో ఉన్నంతలో అభివృ ద్ధి కార్యక్రమాలు నియోజకవర్గంలో చేస్తూ వస్తున్నారు.ఇలా మొత్తంగా వైసీపీ ప‌రిస్థితి ఆందోళ‌న క‌రంగానే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఈ స‌మ‌యంలో జ‌గ‌న్ మ‌ళ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి వ‌స్తేనే త‌ప్ప ప‌రిస్థితిలో మార్పు రాద‌ని చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube