కేసీఆర్ బాధితుల‌కు ఈట‌ల పెద్ద‌పీట‌.. వారికి హుజూరాబాద్ బాధ్య‌త‌లు

తెలంగాణ రాజీకాయ‌లు ఇప్పుడు మంచి జోరుమీదున్నాయి.హుజూరాబాద్ వేదిక‌గా అంద‌రూ పావులు క‌దుపుతున్నారు.

 Huzurabad Is Responsible For Kcr Victims, Etala Master Plan, Etala Rajender, Trs-TeluguStop.com

ఇంకా నోటిఫికేష‌న్ రాకున్నా తెగ ప్ర‌చ‌రాలు చేస్తున్నారు.ఇప్ప‌టికే టీఆర్ ఎస్ అన్ని రకాల అభివృద్ధి ప‌నుల‌ను చేస్తుంటే.

ఇంకోవైపు ఈట‌ల రాజేంద‌ర్ ఇంటింటి ప్ర‌చారాల‌తో హోరెత్తిస్తున్నారు.దీంతో ఇక్క‌ట ఈట‌ల రాజేంద‌ర్ వ‌ర్సెస్ కేసీఆర్ అన్న‌ట్టు వ్యూహాలు అమ‌ల‌వుతున్నాయి.

ఇక ఎలాగైనా ఈట‌ల రాజేంద‌ర్‌ను ఒంట‌రి చేయాల‌ని, ఓడించాల‌ని గులాబీ బాస్ మొద‌టి నుంచి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.ఇప్ప‌టికే ట్ర‌బుల్ షూట‌ర్ హ‌రీశ్ నేతృత్వంలో మంత్రులు గంగుల క‌మ‌లాక‌ర్‌, కొప్పుల ఈశ్వ‌ర్ తోపాటు మాజీ ఎంపీ వినోద్ కుమార్‌, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని ఊర్ల‌ను చుట్టేస్తున్నారు.

అభివృద్ధి ప‌నుల‌ను ద‌గ్గ‌రుండి మ‌రీ చేయిస్తున్నారు.దీంతో ఈట‌ల‌కు ఎఫెక్ట్ ప‌డుతోంది.

Telugu @bjp4india, Eetala Rajender, Etala, Etala Master, Etala Rajender, Harish

అయితే ఎలాగైనా టీఆర్ ఎస్ వ్యూహాల‌ను దెబ్బ తీయాల‌ని ఈట‌ల రాజేంద‌ర్ మాస్ట‌ర్ ప్లాన్ వేశారు.ఆనాటి ఉద్యమనాయకులను చేర‌దీసి ప్ర‌చ‌రా బాధ్య‌త‌ల‌ను అప్ప‌గిస్తున్నారు.ఇందులో మ‌రీ ముఖ్యంగా చెప్పాలంటే ఒక‌ప్పుడు కేసీఆర్ వాడుకొని ప‌ద‌వులు ఇవ్వ‌కుండా అవ‌మానించిన ప్ర‌స్తుత‌ బీజేపీ నాయ‌కులైన స్వామి గౌడ్, విజయశాంతి, మాజీ ఎంపీ వివేక్ లాంటి వారికి నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చార బాధ్య‌త‌ల‌ను ఇవ్వాల‌ని ఈట‌ల రాజేంద‌ర్ భావిస్తున్నారు.వీరికి టీఆర్ ఎస్ వ్యూహాల‌ను దెబ్బ‌కొట్టే ప్లాన్లు వేయ‌డం చాలా బాగా వచ్చు.

కేసీఆర్‌ను చాలా దగ్గ‌రి నుంచి ఎదుర్కొన్న వారిలో వీరు కూడా ఉండ‌టం క‌లిసొచ్చే అంశం.ఇక త్వ‌ర‌లోనే వీరు రంగంలోకి దిగుతార‌ని తెలుస్తోంది.వీరైతే సింప‌తీ ఉంటుంద‌ని ఆలోచిస్తున్నారు ఈట‌ల‌.మ‌రి ఆయ‌న ప్లాన్ వ‌ర్కౌట్ అవుతుందా లేక దెబ్బ కొడుతుందా అనేది వేచిచూడాలి.

మొత్తానికి టీఆర్ ఎస్‌కు ధీటుగానే ఈట‌ల రాజేంద‌ర్ కూడా ప్లాన్లు వేస్తున్నారు.మ‌రి బీజేపీ అగ్ర నేత‌లు ఎలా మెదులుతారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube