కేటీఆర్ హరీష్ మధ్య ఏదో జరుగుతోందే అది ఇదేనా ?

తెలంగాణ అధికార పార్టీలో నెలకొన్న రాజకీయ పరిణామాలు అంతు చిక్కని విధంగా ఉన్నాయి.ముఖ్యంగా ఆ పార్టీలోని కీలక నాయకుల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు ఏ విధంగా మలుపు తిరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.

 Telugu News Political-TeluguStop.com

సీఎం కేసీఆర్ కు తెలిసి జరుగుతుందో తెలియక జరుగుతుందో కానీ ఈ వ్యవహారం మాత్రం చాలా కాలంగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.వీలైనంత తొందరలో తన కుమారుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రి కుర్చీపై కూర్చోబెట్టాలని కలలుగంటున్న కేసీఆర్ దానికి తగ్గట్టుగానే పరిస్థితులు కేటీఆర్ కు అనుకూలంగా మార్చుతున్నాడు.

ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అప్పగించి కేటీఆర్ ప్రాధాన్యం పెంచారు కేసీఆర్.అయితే ఈ సందర్భంగా కేసిఆర్ మేనల్లుడు హరీష్ రావు వ్యవహారం తెర మీదకు వస్తోంది.

గత కొంత కాలంగా హరీష్ రావు ను చిన్నచూపు చూస్తున్నారనే భావన ఆ పార్టీ నేతల్లో ఎక్కువైంది.ఇటీవల ఏపీలోని తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శించుకునేందుకు కేటీఆర్, హరీష్ రావు తిరుమల వెళ్లారు.

ఈ సందర్భంగా ఈ ఇద్దరికీ వేరువేరుగా ప్రాధాన్యం ఏపీ ప్రభుత్వం ఇవ్వడం చర్చనీయాంశమయింది.కేటీఆర్ కు ముఖ్యమంత్రి స్థాయిలో ఏర్పాట్లు చేయగా హరీష్ రావు ను మాత్రం అంతగా పట్టించుకోకుండా అవమానించారనే విషయం వైరల్ అయిన సంగతి తెలిసిందే.

కేటీఆర్ ను సీఎం చేయాలనుకుంటే అది కేసీఆర్ ఇష్టం.కానీ ఈ సమయంలో హరీష్ ప్రాధాన్యతను తగ్గించాల్సిన అవసరం ఎందుకు వస్తుంది ఇలా అవమానాలు చేయాల్సిన అవసరం ఏంటి అనే చర్చ పార్టీలో ఊపందుకుంది.

Telugu Ktr Harish-Telugu Political News

మున్సిపల్ ఎన్నికలు ముగిసిన అనంతరం ఈ రకమైన చర్యలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.ముఖ్యంగా మంత్రి మండలిని ప్రక్షాళన చేసి కేటీఆర్ టీమ్ ను మంత్రి వర్గంలోకి తీసుకుని ఆ తర్వాత ఆయన్ను సీఎం కుర్చీలో కూర్చోబెడతారనే ప్రచారం ఊపందుకుంది.ఎప్పటికైనా హరీష్ రావు కేటీఆర్ కు పోటీ అవుతారనే భావంతోనే ఆయన ప్రాధాన్యత తగ్గిస్తున్నారు అనే అనుమానం పార్టీ శ్రేణుల్లో ఎక్కువయ్యింది.ప్రస్తుతం తెలంగాణలో టిఆర్ఎస్ కు ఎదురేలేదు అన్నట్టుగా ఉంది.

కాంగ్రెస్ పూర్తిగా బలహీనపడి టిడిపి కనుమరుగవుతున్న ఈ పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే కొద్దికొద్దిగా బిజెపి బలం పుంజుకుంటుంది.

ఒక రకంగా చెప్పాలంటే టిఆర్ఎస్ కు ఇప్పట్లో ఏ పార్టీ పోటీ వచ్చే అవకాశమే లేదు.

అందుకే తమ పార్టీలో ఎదురే లేకుండా చేసుకునేందుకు హరీష్ రావు ను ఇలా అవమానాల పాలు చేస్తూ ఆయన ప్రాధాన్యం తగ్గించే రాజకీయ ఎత్తుగడకు కెసిఆర్, కేటీఆర్ దిగారనే విమర్శలు వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube