తెలంగాణ రాష్ట్ర తోలి ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమ రథసారధి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జీవితచరిత్రను వెండితెరపైకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఈ సినిమాని ప్రముఖ దర్శకనిర్మాత మధుర శ్రీధర్ రూపొందించనున్నారు.
ఈ విషయమై శ్రీధర్ ఇప్పటికే ఓ ప్రకటన చేసారు.అలాగే ఈ చిత్రాన్ని తెలుగు – హిందీ భాషాల్లో రూపొందించి వచ్చే ఏడాది, కెసిఆర్ పుట్టినరోజు కానుకగా 17న విడుదల చేసే యత్నాల్లో ఉన్నారు
విడుదల తేది ప్రకటించారు సరే కాని ఇంతవరకు ఈ సినిమా షూటింగ్ మొదలు కాలేదు.షూటింగ్ మొదలు కావడం పక్కనపెడితే కెసిఆర్ జీవిత చరిత్రలో కెసిఆర్ పాత్ర పోషించే నటుడు ఎవరో ఇంకా కన్ఫర్మ్ కాలేదు.కెసిఆర్ పాత్ర అంటే మామూలుగా ఉండదుగా.
దాన్ని అద్భుతంగా పోషించే నటుడు కావాలి, అలాగే చూడ్డానికి దగ్గరదగ్గరగా అయినా కెసిఆర్ లా కనిపించాలి.అలా ఏంతో కొంతో అనిపించే నటులు రాజ్ కుమార్ రావు మరియు నవాజోద్దిన్ సిద్దిఖి.
ఈ ఇద్దరు ప్రస్తుతం బాలివుడ్ లో ఉన్న గొప్ప నటుల్లో ఇద్దరు.
మొదట రాజ్ కుమార్ రావుని ఫిక్స్ చేసుకున్నట్లు వార్తలు వచ్చినా, ఇప్పుడు ఈ ప్రాజెక్టు నవోజోద్దిన్ చేతిలో పడేలా కనిపిస్తున్నాయి.
రాజ్ కుమార్ తో పోల్చుకుంటే హిందీలో నవాజోద్దిన్ మార్కెట్ ఎక్కువ.నవోజోద్దిన్ రాజ్ కుమార్ కంటే మంచి నటుడు.
కాబట్టి కేసీఆర్ పాత్రను నవోజోద్దిన్ నే వరించేలా ఉంది.చూడాలి మరి, కెసిఆర్ లాంటి మాస్ లీడర్ ని సమర్థవంతంగా ఎవరు పోషిస్తారో.